కొత్త జిల్లాల పోరుపై కోదండరాం ఉద్యమం ఎలా ఉండబోతోంది?
తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు కేసీఆర్ కు కొత్త చిక్కులు తేనున్నాయి. కొత్త జిల్లాలను సరైన ప్రాతిపదికన విభజించకపోతే.. ఉద్యమం తప్పదని జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన సన్నిహితులు చాలామంది అసంతృప్తి ఉన్నా.. పైకి మాత్రం ఏమీ అనడం లేదు. అయినా వీటిని ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు. తాజాగా కొత్త జిల్లాల […]
తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు కేసీఆర్ కు కొత్త చిక్కులు తేనున్నాయి. కొత్త జిల్లాలను సరైన ప్రాతిపదికన విభజించకపోతే.. ఉద్యమం తప్పదని జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన సన్నిహితులు చాలామంది అసంతృప్తి ఉన్నా.. పైకి మాత్రం ఏమీ అనడం లేదు. అయినా వీటిని ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటును మరింత ముమ్మరం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ శనివారం తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన భేటీ అయింది. ఎంత చేసినా కొత్త జిల్లాలపై పోరు విషయంలో కోదండరామ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం లోలోన ఆందోళన చెందుతూనే ఉంది.
రెండు నెలల కిందట నిరుద్యోగుల కోసం దసరా నుంచి పోరుబాట పడతామని హెచ్చరించారు కోదండరామ్. ఈ క్రమంలో ప్రభుత్వం 1032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తరువాత ఊపిరి పీల్చుకుంది. దసరా నుంచి ఇక ఎలాంటి ఉద్యమాలు ఉండవని భావించింది. కానీ, ఇటీవల కోదండరామ్ కొత్త జిల్లాలపైనా పోరాటం తప్పదని స్పష్టం చేయడంతో తిరిగి అంతర్మథనంలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఉద్యమం ఎలా ఉండనుందన్న విషయంపై అప్పుడే సమాలోచనలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీనికితోడు కాంగ్రెస్ నేతలు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా లేదంటూ నిరసనలు, ఆందోళనలు మొదలు పెట్టారు. ఈ సమయంలో కోదండరామ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కొత్త జిల్లాల నిర్ణయానికి పోరాటానికి దిగితే.. అప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక గండం గడిచిందంటే.. మరో గండం పొంచి ఉండటమంటే ఇదేనేమో!
Click on Image to Read: