చంద్రబాబు డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధపడాలట...
రాయలసీమకు సాగు నీరు ఇవ్వాలంటూ కడపలో వైఎస్ జగన్ మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లా కమ్యూనిస్టుల నాయకులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు అన్ని తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారని జిల్లా సీపీఎం నాయకుడు అంజనేయులు విమర్శించారు. దీని వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పైగా రాయలసీమ వారిని రౌడీలుగా, హంతకులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ మధ్య చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు వస్తే పదేపదే తాను కూడా రాయలసీమ బిడ్డనేనని చెప్పుకుంటున్నారని అంజనేయులు ఎద్దేవా చేశారు. తమకైతే చంద్రబాబు రాయలసీమ […]
రాయలసీమకు సాగు నీరు ఇవ్వాలంటూ కడపలో వైఎస్ జగన్ మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లా కమ్యూనిస్టుల నాయకులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు అన్ని తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారని జిల్లా సీపీఎం నాయకుడు అంజనేయులు విమర్శించారు. దీని వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పైగా రాయలసీమ వారిని రౌడీలుగా, హంతకులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ మధ్య చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు వస్తే పదేపదే తాను కూడా రాయలసీమ బిడ్డనేనని చెప్పుకుంటున్నారని అంజనేయులు ఎద్దేవా చేశారు. తమకైతే చంద్రబాబు రాయలసీమ బిడ్డలా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ అయితే డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధపడాలన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో చంద్రబాబును జగన్ కూడా నిలదీయాలన్నారు. కడప స్టీట్ ప్లాంట్ కోసం అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రభుత్వాలపై వైసీపీ నేతలు ఒత్తిడి తేవాలని కోరారు.
చంద్రబాబును నమ్ముకుంటే ఆయన మనవడు దేవాన్ష్‌కు 20 ఏళ్లు వచ్చినా రాయలసీమ జనం ఇలాగే బతకాల్సి ఉంటుందని మరో వామపక్ష నేత ఈశ్వరయ్య అన్నారు. కడప జిల్లాకు నీళ్లు తెస్తామంటూ టీడీపీ నేత, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గడ్డం పెంచుకుని ఏడాదిన్నరగా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన గడ్డం పెరుగుతోంది కానీ నీళ్లు మాత్రం రావడం లేదన్నారు. ఇప్పటికైనా జనంలో సెంటిమెంట్ రెచ్చగొట్టేలా గడ్డాలు పెంచుకోవడం మానేసి చంద్రబాబుపై ఒత్తిడి తెవాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న ఉర్దూ యూనివర్శిటీని కూడా తరలించుకుపోయారని దీనిపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. భ్రమరావతికి నీరు మట్టి తీసుకురమ్మని చంద్రబాబు ఆదేశించగానే గోచిలు ఎగ్గట్టుకుని టీడీపీ నేతలు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు సమాధి కట్టేందుకుచంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈశ్వరయ్య మండిపడ్డారు.
Click on Image to Read: