కోడెల అరాచకాలపై బోర్డు సీరియస్

సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాద్‌ కుటుంబం సమాంతరపాలన నడుపుతుండడంపై రైల్వే బోర్డు సీరియస్‌గా స్పందించింది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ వేయాలంటే తమకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ కోడెల కుమారుడు కోడెల శివరామకృష్ణ అడ్డుపడడంపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అసలు రైల్వే లైన్‌ కావాలో .. వద్దో.. తేల్చుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డు లేఖ రాసింది. ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దమనుషులే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం […]

Advertisement
Update:2016-09-03 05:20 IST

సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాద్‌ కుటుంబం సమాంతరపాలన నడుపుతుండడంపై రైల్వే బోర్డు సీరియస్‌గా స్పందించింది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ వేయాలంటే తమకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ కోడెల కుమారుడు కోడెల శివరామకృష్ణ అడ్డుపడడంపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అసలు రైల్వే లైన్‌ కావాలో .. వద్దో.. తేల్చుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డు లేఖ రాసింది. ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దమనుషులే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రైల్వే బోర్డు నుంచి వచ్చిన లేఖను సీఎస్ టక్కర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఓటుకునోటు కేసుతో చికాకులో ఉన్న చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళుతూ ఉండడంతో చంద్రబాబు దీనిపై ఏమీ తేల్చలేదని చెబుతున్నారు.

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ నిర్మాణంలో జరుగుతున్న 100 కోట్ల పనుల్లో తమకు 25 శాతం వాటా ఇవ్వాలని ఇటీవల కోడెల శివరామకృష్ణ కాంట్రాక్టర్‌, రైల్వే అధికారులను బెదిరిస్తున్నారు. వారు మాట వినకపోవడంతో కొద్ది రోజుల క్రితమే అనుచరులను పంపించి పనులు చేస్తున్న వారిని కర్రలు, రాడ్లతో చితక కొట్టారు. ఇద్దరు రైల్వే సిబ్బందిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం వారిని వదిలేశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి రౌడియిజం చేస్తే పనులు చేయలేమని… రైల్వే లైన్ కావాలో వద్దో తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చూడాలి చంద్రబాబు ఏం చేస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News