చంద్రబాబుకు మంచి అవకాశం మిస్ అయింది..

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు ఒక మంచి అవకాశం జారవిడుచుకున్నారన్నారు. విచారణ జరిపించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని తామంతా భావించామన్నారు. కానీ చంద్రబాబు స్టే తెచ్చుకుని ఆ అవకాశం పోగొట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో రాష్ట్రం చెప్పడం లేదని అందువల్లే తదుపరి సాయంలో ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రత్యేకహోదా అన్న పదాన్ని […]

Advertisement
Update:2016-09-03 11:19 IST

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు ఒక మంచి అవకాశం జారవిడుచుకున్నారన్నారు. విచారణ జరిపించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని తామంతా భావించామన్నారు. కానీ చంద్రబాబు స్టే తెచ్చుకుని ఆ అవకాశం పోగొట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో రాష్ట్రం చెప్పడం లేదని అందువల్లే తదుపరి సాయంలో ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రత్యేకహోదా అన్న పదాన్ని వాడలేకపోతున్నామని… కానీ హోదాకు సమానమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినా కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. మరోవైపు శనివారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News