ఓటుకు నోటుపై పోరాటానికి ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓటుకు నోటు కేసుపై స్పందించారు. ఓటుకు నోటులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు సంభాషణను ప్రజలంతా విన్నారని… అన్ని టీవీ ఛానళ్లలోనూ ఆ టేపులు ప్రసారం అయ్యాయన్నారు. ఇంతకు మించి సాక్ష్యాలు అవసరం లేదన్నారు. హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించినా నిజాలు బయటకు రాకుండాపోవన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు కేసులో తాను కూడా ఇంప్లీడ్ అవుతున్నట్టు ఉండవల్లి చెప్పారు. ఓటుకు నోటు లాంటి వ్యవహారమే ఉత్తరాఖండ్‌లో జరిగితే […]
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓటుకు నోటు కేసుపై స్పందించారు. ఓటుకు నోటులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు సంభాషణను ప్రజలంతా విన్నారని… అన్ని టీవీ ఛానళ్లలోనూ ఆ టేపులు ప్రసారం అయ్యాయన్నారు. ఇంతకు మించి సాక్ష్యాలు అవసరం లేదన్నారు. హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించినా నిజాలు బయటకు రాకుండాపోవన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు కేసులో తాను కూడా ఇంప్లీడ్ అవుతున్నట్టు ఉండవల్లి చెప్పారు. ఓటుకు నోటు లాంటి వ్యవహారమే ఉత్తరాఖండ్‌లో జరిగితే అక్కడ ఏకంగా సీఎంను తొలగించారని గుర్తు చేశారు. డబ్బు సంచులతో రేవంత్‌రెడ్డిని పంపింది చంద్రబాబేనని ఆడియో, వీడియో టేపుల్లో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదాను కూడా చంద్రబాబు తాకట్టు పెట్టారని ఉండవల్లి ఆరోపించారు.
పోలవరం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద సాగునీటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతుంది. గోదావరి నుంచి 1000 టీఎంసీలు వాడుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదన్నారు. పోలవరం నీటిని కోస్తా జిల్లాలకు అందించి, కృష్ణా నీటిని రాయలసీమ, తెలంగాణకు మళ్లించాలని వైఎస్ఆర్ అప్పట్లో ఆలోచన చేశారన్నారు. నారాయణ విద్యాసంస్థల దోపిడి అధికమైపోయిందన్నారు. నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి అయ్యాక నారాయణ కాలేజీల దోపిడికి అడ్డులేకుండాపోయిందన్నారు. దోపిడికి పాల్పడుతున్న నారాయణ కాలేజీలతో పాటు ఇతర కాలేజీలపైనా తాను పోరాటం చేస్తానన్నారు. ప్రజలు కూడా ముందుకు రావాలని కోరారు.
Click on Image to Read: