నిజాం షుగ‌ర్స్ ప్ర‌యివేటీక‌ర‌ణ బాబు ఘ‌న‌తేగా!

నిజామాబాద్ ఎంపీ క‌విత మ‌రోసారి బాబుపై విరుచుకుప‌డ్డారు. తెలుగుదేశం హ‌యాంలో లాభాల బాట‌లో ఉన్న నిజాం షుగ‌ర్స్‌ను ప్ర‌యివేటుప‌రం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేగా అని గుర్తు చేశారు. నిజాం హ‌యాంలో 1938లో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ తెలంగాణ‌కు సంప్ర‌దాయంగా వ‌చ్చిన వార‌స‌త్వ సంప‌ద అన్నారు. 2002లో లాభాల బాట‌లో ఉన్న నిజాంషుగ‌ర్ ఫ్యాక్టరీని ప్ర‌యివేటు ప‌రం చేసింది చంద్ర‌బాబే అన్న సంగ‌తి ఎవ‌రూ మ‌రిచిపోలేద‌న్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌శ్నించారు. త‌రువాత ప‌దేళ్ల‌పాటు […]

Advertisement
Update:2016-09-02 02:30 IST
నిజామాబాద్ ఎంపీ క‌విత మ‌రోసారి బాబుపై విరుచుకుప‌డ్డారు. తెలుగుదేశం హ‌యాంలో లాభాల బాట‌లో ఉన్న నిజాం షుగ‌ర్స్‌ను ప్ర‌యివేటుప‌రం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేగా అని గుర్తు చేశారు. నిజాం హ‌యాంలో 1938లో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ తెలంగాణ‌కు సంప్ర‌దాయంగా వ‌చ్చిన వార‌స‌త్వ సంప‌ద అన్నారు. 2002లో లాభాల బాట‌లో ఉన్న నిజాంషుగ‌ర్ ఫ్యాక్టరీని ప్ర‌యివేటు ప‌రం చేసింది చంద్ర‌బాబే అన్న సంగ‌తి ఎవ‌రూ మ‌రిచిపోలేద‌న్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌శ్నించారు. త‌రువాత ప‌దేళ్ల‌పాటు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ దీని గురించి ఆలోచించే సోయి కాంగ్రెస్ పార్టీకి లేక‌పోయింద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌యివేటు ప‌రం చేసిన‌ప్ప‌టి నుంచి నిజాం షుగ‌ర్స్ లో న‌ష్టాలు చూపిస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా దాదాపు 66 కోట్ల రూపాయ‌లు సాయం చేసింద‌ని గుర్తు చేశారు. నష్టాల కార‌ణంతో చివ‌ర‌కి లాకౌట్ ప్ర‌క‌టించింద‌ని, ఇప్పుడు ఈ విష‌యం బీఐఎఫ్‌ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్‌స్ట్రక్షన్) ప‌రిధిలో ఉంద‌ని, దానిపై ఆ బోర్డు నిర్ణ‌యం తీసుకునేవ‌ర‌కు ఏమీ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. ఫ్యాక్టీరిని స‌హ‌కార ప‌ద్ధ‌తిలో న‌డుపుకోవాల‌ని అపుడే లాభాల బాట ప‌డ‌తాయ‌ని అభిప్రాయాన్ని వెల్లడించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News