హోదాపై ప్రెస్‌మీట్ పెట్టి తేల్చేసిన సుజనా చౌదరి

ప్రత్యేక హోదా ఇక లేనట్టే. టీడీపీ కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ విషయం చెప్పారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని సుజనా చౌదరి చెప్పారు. హోదా ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం చెబుతోందన్నారు. కాబట్టి హోదాతో సమానంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. హోదా ఇస్తే ఎంత మేర నిధులు అందుతాయి?, వాటిని ప్యాకేజ్ రూపంలో ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై కేంద్రం తర్జన భర్జన పడుతోందన్నారు. హోదా ఇస్తే ఏపీకి […]

Advertisement
Update:2016-09-01 14:38 IST

ప్రత్యేక హోదా ఇక లేనట్టే. టీడీపీ కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ విషయం చెప్పారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని సుజనా చౌదరి చెప్పారు. హోదా ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం చెబుతోందన్నారు. కాబట్టి హోదాతో సమానంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. హోదా ఇస్తే ఎంత మేర నిధులు అందుతాయి?, వాటిని ప్యాకేజ్ రూపంలో ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై కేంద్రం తర్జన భర్జన పడుతోందన్నారు. హోదా ఇస్తే ఏపీకి అదనంగా రూ. 2700 కోట్లు వస్తాయని వాటిని మరోమార్గంలో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

గతంలో 15ఏళ్ల పాటు హోదా ఇవ్వాలని అడిగామని… ఇప్పుడు కనీసం ఐదేళ్లపాటు హోదా ఇవ్వాల్సిందిగా తాము కోరుతున్నాయని అదే ప్రెస్‌మీట్‌లో సుజనా చెప్పారు. పోలవరం నిర్మాణానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు ఏటా ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లను ఆరేళ్ల పాటు కేంద్రం ఇస్తుందన్నారు. రేపే అధికారంలోకి వచ్చేయాలన్న విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం సరికాదన్నారు. తమకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారన్నారు.

మొత్తం మీద ఏపీకి ప్రత్యేక హోదా రాదని సుజనా చెప్పేశారు. అంతేకాదు హోదా ఇస్తే రూ. 2700 మాత్రమే అదనంగా వస్తాయని చెప్పడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. నిధులు సరే మరి హోదా వల్ల పరిశ్రమల ఏర్పాటుకు అందే రాయితీల సంగతేంటో?. సుజనా చౌదరి తన ప్రెస్‌మీట్లో కాసేపు టీడీపీ ప్రతినిధిగా, మరికాసేపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడడం విశేషం. మొత్తానికి మూడు రోజులుగా హోదాపై కసరత్తు జరుగుతోందంటూ కలరింగ్ ఇచ్చిన వెంకయ్య, సుజనా చౌదరి చివరకు ఏపీ ప్రత్యేక హోదాకు సమాధి కట్టేశారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News