ఓటుకు నోటులో ట్విస్ట్.. లొంగిపోవాలని స్టిఫెన్‌సన్‌కు హైకోర్టు ఆదేశం
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 29న కోర్టు ముందు హాజరుకావాలని రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లకు కోర్టు ఆదేశించింది. గతంలోతాము దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ ఏసీబీ కోరడంతో అందుకు కోర్టు అంగీకరించింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేస్తున్నామని కోర్టుకు తెలంగాణ ఏసీబీ తెలియజేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ అవసరం లేదని… వచ్చే 29లోగా చంద్రబాబుపై విచారణ […]
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 29న కోర్టు ముందు హాజరుకావాలని రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లకు కోర్టు ఆదేశించింది. గతంలోతాము దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ ఏసీబీ కోరడంతో అందుకు కోర్టు అంగీకరించింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేస్తున్నామని కోర్టుకు తెలంగాణ ఏసీబీ తెలియజేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ అవసరం లేదని… వచ్చే 29లోగా చంద్రబాబుపై విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని ఏసీబీ వెల్లడించింది.
మరోవైపు ఓటుకు నోటు బయటపడడానికి కారణమైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో నిందితుడు మత్తయ్య వేసిన క్యాష్ పిటిషన్‌ను హైకోర్టు జడ్జి శివశంకర్ విచారించకూడదంటూ స్టిఫెన్‌సన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అభిప్రాయపడిన కోర్టు వచ్చే నెల 30లోగా పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని స్టిఫెన్‌సన్‌కు ఆదేశించింది. లక్ష రూపాయల పూచీకత్తును సీపీకి సమర్పించాలని ఆదేశించింది.
Click on Image to Read: