రేవంత్‌ బ్యాచ్‌పైకి తుపాకి ఎక్కుపెట్టిన కానిస్టేబుల్

కరీంనగర్ జిల్లా జైలు వద్ద టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఒక కానిస్టేబుల్ ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టే స్థాయికి పరిస్థితి వెళ్లింది. జైల్లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావును పరామర్శించేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు జైలు వద్దకు వచ్చారు. రేవంత్‌, ఒంటేరును లోపలికి అనుమతించారు. అయితే ఈ సమయంలో మిగిలిన టీడీపీనాయకులు, కార్యకర్తలు కూడా జైల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి దూసుకెళ్లారు. […]

Advertisement
Update:2016-08-31 13:31 IST

కరీంనగర్ జిల్లా జైలు వద్ద టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఒక కానిస్టేబుల్ ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టే స్థాయికి పరిస్థితి వెళ్లింది. జైల్లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావును పరామర్శించేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు జైలు వద్దకు వచ్చారు. రేవంత్‌, ఒంటేరును లోపలికి అనుమతించారు. అయితే ఈ సమయంలో మిగిలిన టీడీపీనాయకులు, కార్యకర్తలు కూడా జైల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి దూసుకెళ్లారు. సెక్యూరిటీగా ఉన్న సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ చోట నేత ఒకరు మీసం మేలేసి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది.

ఈసమయంలో సహనం కోల్పోయిన ఒక కానిస్టేబుల్ టీడీపీ నేతలపైకి తుపాకీ ఎక్కుపెట్టారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్‌ను మిగిలిన సిబ్బంది అడ్డుకున్నారు. ”మీరు రాజకీయంగా ఐదేళ్లే ఉంటారు.. నేను 60 ఏళ్లు ఉంటా” అంటూ కానిస్టేబుల్ వార్నింగ్ ఇచ్చాడు. చివరకు బయట కేకలు విన్న జైలు ఉన్నతాధికారులు లోపలి నుంచి వచ్చి ఇరువర్గాలను శాంతింపచేశారు. పరామర్శ అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి… కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. ముందు ఈటెల, హరీష్‌రావును అరెస్ట్ చేసి చిప్పకూడు పెట్టాలన్నారు. వారిద్దరే నీటి దొంగలని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News