లోకేష్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్... కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సిద్ధం

నందమూరి కుటుంబంలో పైకి కనిపించని అధిపత్యం మరో రూపంలో వెలుగు చూసింది. ఎప్పటికైనా జూనియర్‌ ఎన్టీఆర్…లోకేష్‌కు పోటీ అవుతారనే భావన ఉన్న నేపథ్యంలో జూనియర్‌ను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌ సినిమాతో మరోసారి రచ్చమొదలైంది. నాన్నకుప్రేమతో సినిమాను అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నించిన లోకేష్‌, బాలకృష్ణలు ఇప్పుడు గ్యారేజ్‌ను ధ్వంసం చేసేందుకు సిద్ధపడ్డట్టు చెబుతున్నారు. ఇందుకు బలం చేర్చేలా ప్రభుత్వం నుంచి విడుదలైన ఆదేశాలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సెప్టెంబర్ 1న […]

Advertisement
Update:2016-08-31 03:20 IST

నందమూరి కుటుంబంలో పైకి కనిపించని అధిపత్యం మరో రూపంలో వెలుగు చూసింది. ఎప్పటికైనా జూనియర్‌ ఎన్టీఆర్…లోకేష్‌కు పోటీ అవుతారనే భావన ఉన్న నేపథ్యంలో జూనియర్‌ను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌ సినిమాతో మరోసారి రచ్చమొదలైంది. నాన్నకుప్రేమతో సినిమాను అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నించిన లోకేష్‌, బాలకృష్ణలు ఇప్పుడు గ్యారేజ్‌ను ధ్వంసం చేసేందుకు సిద్ధపడ్డట్టు చెబుతున్నారు. ఇందుకు బలం చేర్చేలా ప్రభుత్వం నుంచి విడుదలైన ఆదేశాలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోకు అడ్డంకులు కల్పించేలా తెరవెనుక రాజకీయం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరికలతో ఆ వ్యూహం ఫలించలేదు.

ఈ నెల 31 అర్ధరాత్రి దాటిన తరువాత జిల్లా వ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా 34 బెనిఫిట్ షోలు ప్రదర్శనకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను డిస్ట్రిబ్యూటర్లు రాతపూర్వకంగా కోరారు. బెనిఫిట్‌ షోల విషయంలో డిస్టిబ్యూటర్లు దరఖాస్తు చేసుకోవడం, అధికారులు అనుమతి ఇవ్వడం సాధారణంగా జరిగేదే. కానీ జనతా గ్యారేజ్‌ సినిమా విషయంలో కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్ మరోలా స్పందించారు. బెనిఫిట్ షోలు వేయడానికి వీల్లేందంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కలకలం రేగింది. అన్ని సినిమాలకు అనుమతి ఇస్తూ జనతా గ్యారేజ్‌కు మాత్రం నిరాకరించడంపై అభిమానులు భగ్గుమన్నారు. విషయం ఆరా తీయగా లోకేష్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే బెనిఫిట్‌ షోకి అనుమతి నిరాకరించినట్టు తేలింది.

ఈ విషయాన్ని లోకేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ సామాజికవర్గానికే చెందిన మంత్రులు దేవినేని ఉమా, పత్తిపాటి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో అభిమానులే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తన అభిమాన నటుడు సినిమాకు అడ్డంకులు సృష్టిస్తే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అభిమానుల హెచ్చరికలను కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కాస్త మెత్తబడింది. మంగళవారం రాత్రి ఎట్టకేలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. అయితే బాలకృష్ణ అభిమానులు మాత్రం జనతా గ్యారేజ్ చూడవద్దంటూ వాట్సాప్‌ ద్వారా మేసేజ్‌లు పంపుతున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాన్నకు ప్రేమతో సినిమా సమయంలోనూ లోకేష్‌, బాలకృష్ణ ఇలాంటి ఆలోచనే చేశారు. నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్‌ ఒకే సారి విడుదల కాగా నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్లు దక్కకుండా అడ్డుకున్నారు. కానీ డిక్టేటర్‌ సినిమా విఫలం అవడం, నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవడంతో కథ అడ్డం తిరిగింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News