కొండల్ రెడ్డి సంగతేంటి?
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను నెలరోజుల్లో తేల్చాలంటూ కోర్టు ఆదేశించిన తర్వాత చంద్రబాబు, సుజనా చౌదరి వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీనేత బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో సమావేశమైన సుజనా చౌదరి ప్రత్యేక హోదా కోసం చర్చించామంటూ చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు కోసమే సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉదయమే హుటాహుటీన హైదరాబాద్ వచ్చి గవర్నర్‌ను కలవాల్సిన అవసరం […]
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను నెలరోజుల్లో తేల్చాలంటూ కోర్టు ఆదేశించిన తర్వాత చంద్రబాబు, సుజనా చౌదరి వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీనేత బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో సమావేశమైన సుజనా చౌదరి ప్రత్యేక హోదా కోసం చర్చించామంటూ చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు కోసమే సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉదయమే హుటాహుటీన హైదరాబాద్ వచ్చి గవర్నర్‌ను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని బొత్స ప్రశ్నించారు.
ఒక వేళ ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి భేటీలు జరుపుతుంటే హోదాతో గవర్నర్‌కు ఏ సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజ్‌భవన్ వ్యవస్థను వ్యవస్థలాగే ఉంచాలని తాము కోరుతున్నామన్నారు. రాజ్‌భవన్‌ను రాజీల భవన్‌గా, లాలూచీ భవన్‌గా మార్చవద్దని బొత్స కోరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించి ఉంటే ఆ విషయాన్ని ప్రధానికి వివరించాలే గానీ గవర్నర్ దగ్గరకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఓటుకునోటు నుంచి చంద్రబాబును జేజమ్మ కూడా కాపాడలేదని చెప్పిన కేసీఆర్… 14 నెలలు అవుతున్నా కేసును ఎందుకు ముందుకుతీసుకెళ్లడం లేదని బొత్స నిలదీశారు. మొదటి చార్జిషీట్‌లో చంద్రబాబు పేరున్నా ఆయన్ను ఎందుకు విచారించలేదో చెప్పాలన్నారు. చట్టం సామాన్యుడికి ఒకలాగా సీఎంకు మరొకలాగా పనిచేస్తుందా అని అన్నారు. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన 50లక్షలు ఎక్కడివో తేల్చాలన్నారు. అసలు లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటేనని బొత్స అన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికైనా ఓటుకునోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.
Click on Image to Read: