పావులా కోడి, ముప్పావులా మసాలా! గుంటూరు ట్యాంకర్ వెనుక...
అనంతపురం, చిత్తూరు జిల్లాలు కరువుబారిన పడి పంటలన్నీ ఎండిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. అప్పటి వరకు పుష్కరాల్లో నిమగ్నమైన చంద్రబాబు తీరా అనంతపురం జిల్లా వచ్చి 20 రోజుల ముందే కరువుపై సమాచారం ఇచ్చి ఉంటే పంటలను కాపాడేవాడినని చెప్పారు. టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుందన్న చంద్రబాబు… రాయలసీమ జిల్లాలు కరువుబారిన పడినవిషయం మాత్రం తెలియదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయం పక్కన పెడితే అనంతపురం జిల్లాలో ఎండిపోతున్న వేరుశనగ […]
అనంతపురం, చిత్తూరు జిల్లాలు కరువుబారిన పడి పంటలన్నీ ఎండిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. అప్పటి వరకు పుష్కరాల్లో నిమగ్నమైన చంద్రబాబు తీరా అనంతపురం జిల్లా వచ్చి 20 రోజుల ముందే కరువుపై సమాచారం ఇచ్చి ఉంటే పంటలను కాపాడేవాడినని చెప్పారు. టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుందన్న చంద్రబాబు… రాయలసీమ జిల్లాలు కరువుబారిన పడినవిషయం మాత్రం తెలియదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయం పక్కన పెడితే అనంతపురం జిల్లాలో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు చంద్రబాబు చేస్తున్నట్టు చెబుతున్న ప్రయత్నాలు చూస్తుంటే విచిత్రంగానే ఉంది.
అనంతపురాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో అని జనం అనుకోవాలనుకున్నారో ఏమో ఏకంగా విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరిలించేందుకు సిద్దమయ్యారు. ఎప్పటిలాగే బాబు మీడియా ఆ విషయాన్ని బాగా ప్రచారం చేసింది. కొన్ని ట్యాంకులు నీళ్లతో బయలుదేరిన ఫొటోలను కూడా జనానికి చూపెట్టారు. అయితే గుంటూరు నుంచి అనంతపురానికి ఒక ట్యాంకర్ వచ్చివెళ్తే ఒక్క డీజిల్ ఖర్చే సుమారు 15వేల రూపాయలు అవుతుంది. ఇక ట్యాంకర్ అద్దె, డ్రైవర్ చార్జ్ అన్నీ కలిపితే పాతిక వేల వరకు అవుతుంది. చంద్రబాబు రెయిన్ గన్స్ ఎంతబాగా పనిచేసినా ఒక ట్యాంకర్ నీళ్లతో అర ఎకరం మించి తడిచేపరిస్థితి లేదు. మరి అర ఎకరం పొలం కాపాడేందుకు పాతిక వేలు పెట్టి గుంటూరు నుంచి నీళ్లు తీసుకురావడం అవసరమా?.ఆ పాతిక వేలు ఏదో రైతులకే ఇస్తే బాగుపడుతారు కదా!. సరే ఇప్పుడు ట్యాంకర్లతో నీటిని ఇచ్చినా పంట బయటపడే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందంటున్నారు. అలాంటప్పుడు ప్రచారం కోసం కాకుంటే ఈ ట్యాంకర్లతో వేరుశనగ పంటకు నీళ్లు తోలే పథకం ఎందుకో!. రాయలసీమ పరువును రాళ్లపాలు చేయడం ఎందుకో!.
Click on Image to Read: