"మనవాళ్లే కాస్త చూసుకోండి..."

ఆంధ్రపదేశ్‌లో బతికితే టీడీపీ వ్యక్తుల్లాగా బతకాలన్నట్టుగా పరిస్థితి తయారైంది. టీడీపీకి సంబంధించిన వారైతే చాలు కాంట్రాక్టులు మొదలుకుని చివరకు పరీక్షల్లో మార్కుల వరకు అన్నీ ఖాతాలో పడిపోతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే అంశం కూడా అలాంటిదే . కొందరు టీడీపీ నేతల పిల్లలు వైద్య విద్య కోర్సు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉండడం ఈ విషయం నేతల చెవిలో పడడం జరిగింది . అంతే వర్శిటీ ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద ఎగ్జిక్యూటివ్ […]

Advertisement
Update:2016-08-31 06:40 IST

ఆంధ్రపదేశ్‌లో బతికితే టీడీపీ వ్యక్తుల్లాగా బతకాలన్నట్టుగా పరిస్థితి తయారైంది. టీడీపీకి సంబంధించిన వారైతే చాలు కాంట్రాక్టులు మొదలుకుని చివరకు పరీక్షల్లో మార్కుల వరకు అన్నీ ఖాతాలో పడిపోతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే అంశం కూడా అలాంటిదే . కొందరు టీడీపీ నేతల పిల్లలు వైద్య విద్య కోర్సు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉండడం ఈ విషయం నేతల చెవిలో పడడం జరిగింది . అంతే వర్శిటీ ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధమయ్యారు. గ్రేస్ మార్కులు కలిసి ఫెయిల్ అయిన నేతల పిల్లలను గట్టెక్కించే పనిమొదలుపెట్టారు. అధికారులు ఇంత వేగంగా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక అసలు ఒత్తిడి వేరే ఉందంటున్నారు. తమ పిల్లలు ఫెయిల్ కావడంతో పలువురు నేతలు సీఎం చంద్రబాబు వద్ద మెరపెట్టుకున్నారు. దీంతో స్వయంగా వర్శిటీ అధికారులకు చంద్రబాబే ఫోన్ చేసి గ్రేస్ మార్కులు కలపాల్సిందిగా ఆదేశించారని చెబుతున్నారు. నిజానికి గ్రేస్ మార్కులు కలపాలంటే అందుకు బలమైన కారణాలుండాలి. పరీక్షల్లో సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు అడిగి ఉంటే అప్పుడు గ్రేస్‌ మార్కులు కలిపే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేనప్పటికీ టీడీపీ నేతల సంతానం కోసమే గ్రేస్‌ మార్కులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మెడికల్ విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా సరే చంద్రబాబు రాజ్యంలో అవన్నీ పట్టించుకునే వారు లేకుండాపోయారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News