కోడెల కూడా ఫోన్‌లో దొరికిపోయారా?
పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో చిక్కు వచ్చి పడింది. నరసరావుపేటలో కొద్ది రోజుల క్రితం నల్లపాటి కేబుల్ విజన్(ఎన్‌సీవీ) కార్యాలయం ధ్వంసం చేసిన కేసులో హైకోర్టు స్పందించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్ లు.. పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎన్‌సీవీ కార్యాలయంపై దాడికి అవసరమైన పరిస్థితులు తయారు చేశారని, కాబట్టి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన కోర్టు కోడెల శివప్రసాదరావు, […]
పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో చిక్కు వచ్చి పడింది. నరసరావుపేటలో కొద్ది రోజుల క్రితం నల్లపాటి కేబుల్ విజన్(ఎన్‌సీవీ) కార్యాలయం ధ్వంసం చేసిన కేసులో హైకోర్టు స్పందించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్ లు.. పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎన్‌సీవీ కార్యాలయంపై దాడికి అవసరమైన పరిస్థితులు తయారు చేశారని, కాబట్టి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన కోర్టు కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివకుమార్, గుంటూరు ఎస్పీ నారాయణనాయక్, పోలీసులు నాగేశ్వరరావు,వీరయ్య చౌదరి, సాంబశివరావు, సురేంద్రబాబు, శ్రీనివాసరావు, లోకనాథంకు నోటీసులు జారీ చేసింది. అంతే కాదు మరో కీలకమైన ఆదేశం కూడా జారీ చేసింది.
కోడెల శివప్రసాద్, కోడెల శివరాములు పోలీసులతో నేరుగా ఫోన్లలో మాట్లాడారని పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో ఆ రోజుల్లో వారందరి కాల్ డేటాను భద్రపరచాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాపోన్, ఐడియా సంస్థలకు కోర్టు ఆదేశించింది. దాడి జరిగిన గతనెల 10, 11 తేదీల్లో స్థానిక పోలీసుల కాల్‌డేటా మొత్తం సమర్పించాలని ఆదేశించింది. దీంతో కోడెల వర్గం ఆందోళన చెందుతోంది. ఒకవేళ నిజంగానే దాడి సమయంలో కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు శివరామకృష్ణలు పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. బహుశా అదే నిజమైతే ఇది కూడా ఒక ఓటుకు నోటు కేసులాగా మారే అవకాశం ఉంది.
Click on Image to Read: