ప్రధాని మోడీ, గవర్నర్ జంగ్‌లపై మండిపడిన కేజ్రీవాల్
తన ప్రమేయం లేకుండానే ఢిల్లీలో కొంతమంది ముఖ్యమైన అధికారులను ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఎల్‌జీ నవాబ్‌జంగ్ మంగళవారం బదిలీ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. బదిలీలకు సంబంధించిన ఫైలును తనకు గాని, కనీసం సంబంధిత శాఖల మంత్రులకు గాని చూపించలేదని ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పరిపాలనను ధ్వంసం చేయాలని ప్రధాని మోడీ, ఎల్‌జీ నవాబ్‌జంగ్ కంకణ బద్ధులయ్యారని కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాకుండా ఢిల్లీలో తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలను […]
తన ప్రమేయం లేకుండానే ఢిల్లీలో కొంతమంది ముఖ్యమైన అధికారులను ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఎల్‌జీ నవాబ్‌జంగ్ మంగళవారం బదిలీ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. బదిలీలకు సంబంధించిన ఫైలును తనకు గాని, కనీసం సంబంధిత శాఖల మంత్రులకు గాని చూపించలేదని ఆరోపించారు.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పరిపాలనను ధ్వంసం చేయాలని ప్రధాని మోడీ, ఎల్‌జీ నవాబ్‌జంగ్ కంకణ బద్ధులయ్యారని కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాకుండా ఢిల్లీలో తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలను తిరగదోడాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు పెంచాలని తాము తీసుకున్న నిర్ణయం ఎల్‌జీకి రుచించలేదన్నారు. ఢిల్లీలో జంగ్ సామంత రాజువలె వ్యవహరిస్తున్నారని, ఆయన తన నిరంకుశ విధానాలను ప్రజలపై రుద్దుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ వరస ట్వీట్లు చేశారు.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మనుగడ సాగించడం ప్రధాని మోడీకి ఇష్టం లేదు. ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత , ఆ సర్కార్‌ను మోడీ, జంగ్‌లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకుని ఆప్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక సవాళ్లు, ఇబ్బందుల మధ్య ఆప్ పరిపాలన ఢిల్లీలో సక్రమంగానే కొనసాగుతున్నది. ఒక దశలో తనను చంపించేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని కూడా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఒక మాదిరిగా, తాము అధికారంలో ఉన్న చోట మరో మాదిరిగా బీజేపీ వ్యవహరిస్తున్నది.
Click on Image to Read: