ఓటుకు నోటుపై గవర్నర్‌కు "బ్రీఫ్డ్"

ఓటుకు నోటు కేసు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో చంద్రబాబు పాత్రను వచ్చే నెల 29లోగా తేల్చాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్, టీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కోర్టు ఆదేశాల గురించి వివరించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినందున… ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చాల్సిన అనివార్యతను గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. గతంలో […]

Advertisement
Update:2016-08-30 15:36 IST

ఓటుకు నోటు కేసు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసులో చంద్రబాబు పాత్రను వచ్చే నెల 29లోగా తేల్చాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్, టీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కోర్టు ఆదేశాల గురించి వివరించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినందున… ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చాల్సిన అనివార్యతను గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది.

గతంలో మత్తయ్యపై కేసును హైకోర్టు కొట్టివేయగా, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశాలను వివరించారు. గవర్నర్‌ కూడా పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయంలో సీఎం కేసీఆర్‌ మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, కేసీఆర్ ఒకటయ్యారన్న విమర్శల నేపథ్యంలో దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని ఆయన భావిస్తున్నారట. తనకు చెడ్డపేరు రాకూడదన్న భావన కేసీఆర్‌లో ఉందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి రెండే మార్గాలున్నాయంటున్నారు. చంద్రబాబు పేరును చార్జిషీట్‌లో నిందితుడిగా చేర్చడం లేదంటే… తెగించి కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని తేల్చేయడం. ఒకవేళ రెండోదే జరిగితే కేసీఆర్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందంటున్నారు.

మరోవైపు కేసును ఎదుర్కొనేందుకు పైకోర్టులను ఆశ్రయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. నేరుగా తాను వెళ్లకుండా కేసులో ఇతర నిందితులను పైకోర్టు పంపితే ఎలా ఉంటుందన్న దానిపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. పలు దపాలుగా న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చలు జరుపుతూనే ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News