పుష్కరాల మీద ఉన్న శ్రద్ద ... రైతుల మీద లేదా..?
పుష్కరాల కోసం 4,000 కోట్లు, రాజధాని శంకుస్థాపనలకోసం 400 కోట్లు, విదేశీ పర్యాటనలకు వేల కోట్లు, అధికార నివాసాలకు, విలాసాలకు వందల కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు 2015-2016 సంవత్సరం కరువు, వరదల వల్ల నష్టపోయిన సుమారు 400 మండలాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయలేడా? అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 5 […]
పుష్కరాల కోసం 4,000 కోట్లు, రాజధాని శంకుస్థాపనలకోసం 400 కోట్లు, విదేశీ పర్యాటనలకు వేల కోట్లు, అధికార నివాసాలకు, విలాసాలకు వందల కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు 2015-2016 సంవత్సరం కరువు, వరదల వల్ల నష్టపోయిన సుమారు 400 మండలాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయలేడా? అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 5 లక్షల ఎకరాలలో వేరుసెనగ పంట ఎండిపోయింది. రాష్ట్రంలోని 315 మండలాల్లో పంటలెండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఒకే దఫాలో రుణమాఫి చేయాలి.
రైతులకు ఎలాంటి ఆర్ధిక సహాయమూ చేయకుండ, పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేయకుండా రెయిన్ గన్స్ అని ఎవేవో మాయ మాటలు చెప్పడంవల్ల ప్రయోజనం లేదని రైతు సంఘం విమర్శించింది.
రెయిన్ గన్స్ ఉన్న దగ్గర ఆయిల్ ఇంజన్‌లు లేవని, ఆయిల్ ఇంజన్‌లు ఉన్న దగ్గర పైపులు అందుబాటులో లేవని ఈ పరిస్థితుల్లో రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడుతానని చెప్పడం, ఫైర్ ఇంజన్‌లతో పంటలకు నీళ్లు సరఫరా చేస్తామనడం, ట్యాంకర్లతో పక్క ఊర్లనుంచి నీళ్లు తెప్పించి పంటలను కాపాడుతానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎద్దేవా చేసింది.
Click on Image to Read: