రంగా ముందే చెప్పారు... జగన్ ఇంటికి వచ్చినప్పుడు అలా అనిపించింది..
విజయవాడ మాజీ ఎమ్మెల్యే , కాపు నాయకుడు వంగవీటి రంగా హత్యకు గురవుతారన్న విషయం కొద్ది రోజులు ముందే తెలిసిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. హత్యకు కొద్ది రోజుల ముందు రంగాయే స్వయంగా తనతో ఈ విషయం చెప్పారన్నారు. ”నాతో పాటు ఉంటే మీరు కూడా పోస్టుమార్టం అయిపోతారు. కాబట్టి మరో కారులో రండి ”అని తనతో చెప్పారన్నారు. రంగాను చంపేస్తారన్న విషయాన్ని రెండుమూడు సార్లు ఆయనే చెప్పారన్నారు. అయితే తాను భయపడితే ఇక విజయవాడలో ఒక్కరు […]
విజయవాడ మాజీ ఎమ్మెల్యే , కాపు నాయకుడు వంగవీటి రంగా హత్యకు గురవుతారన్న విషయం కొద్ది రోజులు ముందే తెలిసిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.
హత్యకు కొద్ది రోజుల ముందు రంగాయే స్వయంగా తనతో ఈ విషయం చెప్పారన్నారు. ”నాతో పాటు ఉంటే మీరు కూడా పోస్టుమార్టం అయిపోతారు. కాబట్టి మరో కారులో రండి ”అని తనతో చెప్పారన్నారు. రంగాను చంపేస్తారన్న విషయాన్ని రెండుమూడు సార్లు ఆయనే చెప్పారన్నారు. అయితే తాను భయపడితే ఇక విజయవాడలో ఒక్కరు కూడా ముందుకు రారన్న ఉద్దేశంతోనే ధైర్యంగా రంగా నిలబడ్డారని చెప్పారు. తెల్లవారితే సీఆర్‌పీఎఫ్ దళాలు విజయవాడ రావాల్సి ఉందని… బలగాలు వస్తే హత్య చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతోనే ప్రత్యర్థులు ముందు రోజే రంగాను చంపేశారని ఉండవల్లి చెప్పారు. రంగాలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయన్నారు. చదువు రాకపోయినా ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలన్న విషయం మాత్రం రంగాకు బాగా తెలుసన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతే ఆ ప్రాంతంలో కులాల విభజన వచ్చిందన్నారు. రంగా హత్యతో అది మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. దేశంలో కేజ్రీవాల్ పాలన చాలా బాగుందన్నారాయన.
జగన్ పార్టీ పెట్టకూడదని తాను అనుకున్నానని.. కానీ ఇప్పుడు జగన్ పార్టీ పెట్టడమే కరెక్ట్ అని ప్రూ అయిందన్నారు. జగన్‌పై సీబీఐ సీరియస్‌గా అటాక్ చేయడం వెనుక కాంగ్రెస్ పాత్ర తప్పకుండా ఉందన్నారు. గోదావరి జిల్లాల్లో వైఎస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు జనం రారేమోనన్న ఉద్దేశంతో ఒక రోజు మాత్రమే యాత్ర పెట్టుకోవాలని తాను సూచించానన్నారు. కానీ ఆ రోజు జగన్ యాత్రకు వచ్చిన జనాన్ని చూసి తానే ఆశ్చర్యపోయానన్నారు. తెల్లవారుజామున కూడా రోడ్లన్నీ జనంతో స్తంభించిపోయాయన్నారు. వైఎస్ మీద జనంలో అంత క్రేజ్ ఉందని తాను కూడా ఊహించలేదన్నారు. బహుశా ఆ జనాన్ని చూసిన తర్వాతే పార్టీ పెట్టాలన్న ఆలోచన జగన్‌కు వచ్చి ఉండవచ్చన్నారు. ఇటీవల జగన్ రాజమండ్రిలోని తమ ఇంటికి వచ్చినప్పుడు జగన్ మనుషులను ఓన్ చేసుకోగలరు అన్న భావన తనతో పాటు కుటుంబసభ్యులకు కలిగిందన్నారు. తమ వాడు అన్న ఫీలింగ్‌ను వైఎస్ తరహాలోనే కలిగించగలడన్న భావన కలిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కలిసి పోటీ చేస్తే టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా దక్కదన్నారు. కాపుల విషయంలో చంద్రబాబు ఎందుకు అగ్రెసివ్‌గా వెళ్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఉండవల్లి ఈ విషయాలు చెప్పారు.
Click on Image to Read: