ఆమె అయితే కాళ్లు చేతులు విరగ్గొట్టించేది...

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ఫైర్ అయ్యారు. పవన్‌ ఒక పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకు పడుతుందని హెచ్చరించారు.  తమిళనాడులో ఇక మాట్లాడి ఉంటే ముఖ్యమంత్రి జయలలిత… కాళ్లు చేతులు ఇరగ్గొట్టించేదన్నారు. తన అన్న చిరంజీవి ఎంపీ పదవీకాలం పూర్తి అయ్యేందుకు దగ్గరపడిందని అందుకే ఇప్పుడు ఎంపీలంతా రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారని టీజీ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇంతకాలం పవన్ […]

Advertisement
Update:2016-08-29 09:09 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ఫైర్ అయ్యారు. పవన్‌ ఒక పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకు పడుతుందని హెచ్చరించారు. తమిళనాడులో ఇక మాట్లాడి ఉంటే ముఖ్యమంత్రి జయలలిత… కాళ్లు చేతులు ఇరగ్గొట్టించేదన్నారు. తన అన్న చిరంజీవి ఎంపీ పదవీకాలం పూర్తి అయ్యేందుకు దగ్గరపడిందని అందుకే ఇప్పుడు ఎంపీలంతా రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారని టీజీ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇంతకాలం పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలాగా నిద్రపోయారా అని ప్రశ్నించారు. ఎంపీలు హిందీ నేర్చుకుంటే ఢిల్లీ పెద్దలకు అంతా అర్థమైపోతుందన్నట్టుగా పవన్ మాట్లాడడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమన్నారు. హోదాసాధించడం అంటే గెడ్డం గీసుకున్నంత ఈజీ కాదన్న విషయం పవన్ గుర్తించుకోవాలన్నారు. వేదికలు ఎక్కి ప్రసంగాలు ఇవ్వడం కాకుండా అసలు హోదా సాధన కోసం ఏం చేస్తారో పవన్ చెప్పాలన్నారు టీజీ.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News