అనూహ్య పరిణామం... ఓటుకు నోటు కేసు పునర్విచారణకు కోర్టు ఆదేశం...
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసు నుంచి చంద్రబాబును తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనంటూ తేలిన ఫోరెన్సిక్ నివేదికను కోర్టు ముందు ఉంచారు. వాయిస్ చంద్రబాబుదేనని తేలినప్పటికీ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని […]
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసు నుంచి చంద్రబాబును తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనంటూ తేలిన ఫోరెన్సిక్ నివేదికను కోర్టు ముందు ఉంచారు. వాయిస్ చంద్రబాబుదేనని తేలినప్పటికీ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. కేసు సరైన దారిలో విచారణ జరగలేదని పునర్ విచారణకు ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు… ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని కేసును పునర్‌విచారణ జరపాలని ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా కేసు పునర్ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
గతేడాది మే 31న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిపెన్‌ను నోట్ల కట్టల బ్యాగ్ ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుపడ్డారు. ఊహించని విధంగా జూన్ 6న చంద్రబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. దీంతో ఓటుకు నోటు దేశంలోనే సంచలనం సృష్టించింది. మొదట్లో విచారణ వేగంగా సాగినా తర్వాత దాదాపు ఆగిపోయింది. చంద్రబాబు, కేసీఆర్ మధ్య కుదిరిన ఒప్పందమే ఇందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్టును కోర్టు పరిగణలోకి తీసుకుని పునర్ విచారణకు ఆదేశించడంతో కేసు ఎటు తిరుగుతుందో చూడాలి!.
Click on Image to Read: