వరుణ దేవుడిని నమ్మారు... నన్ను నమ్ముకోలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. వరుణ దేవుడి గురించి అనంత పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీమలో 25రోజులుగా వర్షాలు లేవు, వేరుశనగ ఎండిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, మీడియా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. నేను రెయిన్ గన్స్‌తో నీళ్లిస్తానంటే నన్ను నమ్ముకోలేదు, వరుణదేవుడిని నమ్మారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సభకు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. వరుణ దేవుడికి బదులు తనను నమ్ముకోవాల్సింది అన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏమిటని […]

Advertisement
Update:2016-08-29 03:49 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. వరుణ దేవుడి గురించి అనంత పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీమలో 25రోజులుగా వర్షాలు లేవు, వేరుశనగ ఎండిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, మీడియా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. నేను రెయిన్ గన్స్‌తో నీళ్లిస్తానంటే నన్ను నమ్ముకోలేదు, వరుణదేవుడిని నమ్మారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సభకు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు.

వరుణ దేవుడికి బదులు తనను నమ్ముకోవాల్సింది అన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏమిటని చర్చించుకున్నారు. అనంతపురం జిల్లాలో పంట దుస్థితిని మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, మీడియా కూడా గుర్తించలేకపోయిందని చెప్పిన చంద్రబాబు కాసేటి తర్వాత మీడియాలో కథనాలు చూసి తనకు తానుగానే ఇక్కడికి వచ్చానని చెప్పారు. అనంతపురం జిల్లా ఎడారిగా మారుతోంది. పంటలను కాపాడేందుకు అమెరికా నుంచి పెద్దపెద్ద మిషన్లు తెచ్చామని చెప్పారు. వరుణుడు కరుణించకపోయినా పంటలను తాను కాపాడుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అయితే రైతులతో చంద్రబాబు నిర్వహించిన ముఖాముఖి కార్యాక్రమంలో పలువురురైతులు .. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. ఇప్పటికే పంట ఎండిపోయింది. ఇప్పుడు రెయిన్ గన్స్ ఇస్తే లాభం ఉండదన్నారు. పైగా రెయిన్ గన్స్ వాడేందుకు నీళ్లు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు వస్తుండడంతో రాత్రికి రాత్రే అమడగూరు మండలం గుండువారిపల్లిలో రైతు శివన్న పొలంలో అధికారులు ఫామ్ పాండ్ తవ్వారు. ట్యాంకర్లతో నీరు తెచ్చి నింపారు. చంద్రబాబు వచ్చి రెయిన్ గన్స్ ఆన్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News