అది అల్జిమర్స్‌లో భాగమే!.. ఫెర్నాండెజ్‌ది ఇదే పరిస్థితి

సాక్షి టీవీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో అనేక విషయాలు, తన అభిప్రాయాలు తెలిపారు. రెండేళ్లలో చంద్రబాబు పాలన చాలా నిరుత్సాహపరిచిందన్నారు. నడ్డివిరిగి పడి ఉన్న రాష్ట్రాన్ని నడిపించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలయ్యారన్నారు. చంద్రబాబు వ్యవహార శైలిపైనే ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యపరిచిందన్నారు. చూస్తుంటే చంద్రబాబుకు అల్జిమర్స్ వచ్చినట్టు అనిపిస్తోందన్నారు. టీవీలో ఒలింపిక్స్ వస్తుంటే స్వయంగా తానే ఆడుతున్నట్టుగా ఊహించుకుని మాట్లాడడం కూడా […]

Advertisement
Update:2016-08-29 02:39 IST

సాక్షి టీవీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో అనేక విషయాలు, తన అభిప్రాయాలు తెలిపారు. రెండేళ్లలో చంద్రబాబు పాలన చాలా నిరుత్సాహపరిచిందన్నారు. నడ్డివిరిగి పడి ఉన్న రాష్ట్రాన్ని నడిపించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలయ్యారన్నారు. చంద్రబాబు వ్యవహార శైలిపైనే ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యపరిచిందన్నారు. చూస్తుంటే చంద్రబాబుకు అల్జిమర్స్ వచ్చినట్టు అనిపిస్తోందన్నారు. టీవీలో ఒలింపిక్స్ వస్తుంటే స్వయంగా తానే ఆడుతున్నట్టుగా ఊహించుకుని మాట్లాడడం కూడా అల్జిమర్స్‌లో ఒక భాగమేనని ఉండవల్లి చెప్పారు. సింధును, సత్యనాదెళ్లను తయారు చేసింది తానేనని చంద్రబాబు చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విదేశాలకు వెళ్లి మా రాష్ట్రంతో మీ దేశం సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఉంటాయే గానీ నేరుగా రాష్ట్రాలతో మరో దేశం సంబంధాలు పెట్టుకోదన్న విషయం కూడా తెలియదా? అని అన్నారు. ఏదో చేయాలని ఆలోచించి ఆలోచించి ఇలా అల్జిమర్స్ బారినపడినట్టుగా అనిపిస్తోందని ఉండవల్లి చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ది ఇలాంటి పరిస్థితేనన్నారు. ఉదయం లేవగానే ఫెర్నాండెజ్ పార్లమెంట్‌కు వెళ్లాలంటారని చెప్పారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు రోజూ ఒకసారి ఫెర్నాండెజ్‌ను పార్లమెంట్‌ వద్దకు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తుంటారని ఉండవల్లి చెప్పారు.

రెండేళ్లలో చంద్రబాబు విజయవంతంగా చేసిన కార్యక్రమం ఏమిటంటే పుష్కరాల్లో పితృదేవతలకు పిండాలు పెట్టడం ఒక్కటేనని ఆయన అన్నారు. పుష్కరాలు శుభకార్యం అయినట్టుగా ఆహ్వానాలు పంపడం ఏమిటని ప్రశ్నించారు. 144 ఏళ్ల మహా పుష్కరాలు అంటున్నారని ఆ లెక్కేంటో తెలియడం లేదన్నారు. కేంద్రంలో తనకు పరిచయం ఉన్న బీజేపీ మంత్రులు ఏపీ గురించి మరోలా చెబుతున్నారని ఉండవల్లి అన్నారు. అంతా పర్సెంటిజీల కోసమే నడుస్తోందంటూ వ్యాఖ్యానించారని చెప్పారు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News