నాకు వెంట్రుకతో సమానం, చెప్పు వస్తా " పవన్‌పై జేసీ ఫైర్

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు పార్లమెంటరీ సిస్టమ్ గురించి తెలుసా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జేసీ… ”నీకు వయసు తక్కువ, అనుభవం తక్కువ, అయినా నోరు ఉందని మాట్లాడుతారా?. అంటే సీఎంకు ఏం తెలియదనుకుంటున్నావా?. పవన్‌ బాబు చాలా తప్పు. ప్రజాప్రతినిధులను కించపరచవద్దు” అని సూచించారు. రాజీనామా చేస్తే హోదా వచ్చేస్తుందా అని ప్రశ్నించారు. అలా […]

Advertisement
Update:2016-08-28 09:16 IST

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు పార్లమెంటరీ సిస్టమ్ గురించి తెలుసా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జేసీ… ”నీకు వయసు తక్కువ, అనుభవం తక్కువ, అయినా నోరు ఉందని మాట్లాడుతారా?. అంటే సీఎంకు ఏం తెలియదనుకుంటున్నావా?. పవన్‌ బాబు చాలా తప్పు. ప్రజాప్రతినిధులను కించపరచవద్దు” అని సూచించారు. రాజీనామా చేస్తే హోదా వచ్చేస్తుందా అని ప్రశ్నించారు. అలా అయితే ఇప్పుడే రాజీనామా చేస్తానని తనకు ఎంపీ పదవి ఒక వెంట్రుకతో సమానమని జేసీ అన్నారు. రాజీనామా చేస్తే హోదా ఎలా వస్తుందో ముందు పవన్‌ కల్యాణ్ చెబితే ఇప్పుడు రాజీనామా చేసి వస్తానన్నారు.. తాను ఒక్కడినే కాదు మొత్తం ఏపీ ఎంపీలు రాజీనామా చేసినా మోదీ దిగి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా మోదీ తీరు ఉందన్నారు.

”పవన్‌ కల్యాణ్‌ రోడ్డు మీదకు వస్తే ఏమవుతుంది. ఈయన బజారులోకి రాగానే హోదా ఇచ్చేస్తారా?. ఒకవేళ నిజంగా హోదా సాధిస్తే మేమంతా పవన్‌కు అనుచరులుగా మారేందుకు సిద్ధం” అన్నారు. అసలు ఎలా హోదా సాధిస్తారో పవన్ వివరించాలన్నారు. ”నోరుందని ఇష్టానుసారం మాట్లాడవద్దు పవన్ బాబు!. చేతనైతే మంచి కార్యక్రమాలు చెయ్ అంతే కానీ ఎప్పుడో రెండు రోజులు బయటకు వచ్చి జిందాబాద్ లు కొట్టించుకుని వెళ్లడం కాదు” అని సూచించారు. మూర్ఖపు ప్రభుత్వాలు మాట వినకుంటే అందుకు ఎంపీలు ఎలా బాధ్యులవుతారని జేసీ ప్రశ్నించారు. ప్రధానిని సర్‌ అనకుండా బూతులు తిట్టాలా అని పవన్‌ ను నిలదీశారు. పవన్‌ కల్యాణ్ తన అన్నని తప్ప అందరినీ విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఎందుకు రాజీనామా చేయలేదని జేసీ ప్రశ్నించారు. తన అన్నను మాత్రం వదిలేసి మిగిలిన ఎంపీలను విమర్శించడం ఏమిటని పవన్ ను జేసీ ప్రశ్నించారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకుని పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించాలని జేసీ సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News