అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే.. ఉసూరుమన్న ప్రతిపక్షాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చింది. సమావేశాల నిర్వహణ కోసం ఆగస్టు 30 లేదా సెప్టెంబరు 17న రెండు తేదీలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. గణేశ్ నవరాత్రుల వస్తుండటంతో ఇటు అసెంబ్లీ సమావేశాలు.. అటు గణేశ్ ఉత్సవాలు బందోబస్తు ఒకేసారి నిర్వహించాలంటే పోలీసులకు కత్తి మీద సామే! రెండు సమావేశాలు ఒకేసారి నిర్వహిస్తే.. భద్రతాపరంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండింటికి ఒకేసారి భద్రత కల్పించడం చాలా కష్టమని, […]
Advertisement
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చింది. సమావేశాల నిర్వహణ కోసం ఆగస్టు 30 లేదా సెప్టెంబరు 17న రెండు తేదీలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. గణేశ్ నవరాత్రుల వస్తుండటంతో ఇటు అసెంబ్లీ సమావేశాలు.. అటు గణేశ్ ఉత్సవాలు బందోబస్తు ఒకేసారి నిర్వహించాలంటే పోలీసులకు కత్తి మీద సామే! రెండు సమావేశాలు ఒకేసారి నిర్వహిస్తే.. భద్రతాపరంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండింటికి ఒకేసారి భద్రత కల్పించడం చాలా కష్టమని, ఒకవేళ కల్పించినా.. అదనపు బలగాల నిర్వహణ చాలా వ్యయంతో కూడుకున్నదని సీఎంకు వివరించారు. దీంతో ఆయన ఆగస్టు 30న ఒకే ఒక్కరోజు అసెంబ్లీ, మండలిలను సమావేశపరచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉభయ సభల స్పీకర్లు మధుసూధనాచారి, స్వామిగౌడ్ లకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ బిల్లు ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లు దేశవ్యాప్తంగా అమలులోకి రావాలంటే.. కనీసం సగం రాష్ర్టాలైనా ఆమోదించాల్సి ఉంటుంది.
సీఎం నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, కరువు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పడేద్దామనుకున్న ప్రతిపక్షాలకు నిరాశే మిగిలింది. సభ సమావేశాల ఎజెండా కేవలం జీఎస్టీ బిల్లు మాత్రమే కావడంతో సర్కారును నిలదీసే అవకాశం లేకుండా పోయిందని ఉసూరుమంటున్నాయి. దీంతో గణేశ్ నవరాత్రులు ముగిసిన తరువాతే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.
Advertisement