జయప్రదంగా ముందుకెళ్లిన జయప్రద

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద హవా తగ్గడం లేదు. తాజాగా ఆమె కేబినెట్ ర్యాంకు పదవిని సొంతం చేసుకున్నారు. జయప్రదను ఉత్తరప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ కవి గోపాల్‌దాస్‍ నీరజ్‌ను ఫిల్మ్ డవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవలే నియమించింది. ఇప్పుడు కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ పదవిని జయప్రదకు ప్రభుత్వం అప్పగించింది. యూపీ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని… పార్టీ వీడే ఆలోచన కూడా […]

Advertisement
Update:2016-08-27 06:52 IST

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద హవా తగ్గడం లేదు. తాజాగా ఆమె కేబినెట్ ర్యాంకు పదవిని సొంతం చేసుకున్నారు. జయప్రదను ఉత్తరప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ కవి గోపాల్‌దాస్‍ నీరజ్‌ను ఫిల్మ్ డవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవలే నియమించింది. ఇప్పుడు కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ పదవిని జయప్రదకు ప్రభుత్వం అప్పగించింది. యూపీ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని… పార్టీ వీడే ఆలోచన కూడా ఉందని ఇటీవల జయప్రద స్నేహితుడు, సీనియర్ నేత అమర్‌ సింగ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కేబినెట్ హోదా పదవిని జయప్రదకు అప్పగించింది. మొత్తం మీద యూపీలోనూ జయప్రద రాజకీయంగా జయపద్రంగానే ముందుకు సాగుతున్నారు. గతంలో యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2010లో అమర్ సింగ్తో పాటు ఆమె పార్టీ నుంచి వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ ఎస్పీ గూటికి చేరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News