కేసీఆర్ రాజీనామా ఎందుకు చేస్తారంటే..?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ, ఉద్యమ సమయంలో ఈయన్ను ఈ పేరుతో ఎవరూ పిలిచేవారు కారు. ఉద్యమం చేసిన తొలినాళ్లలో కేసీఆర్.. అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్! అన్నట్లుగానే ఉండేది. ముఖ్యంగా 2004లో కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. తరువాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వంలో చేరారు. ఉద్యమం పక్కనబెట్టి పదవులు అనుభవిస్తున్నారన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం నుంచి బయటికి వచ్చారు. తరువాత ఈ […]
Advertisement
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ, ఉద్యమ సమయంలో ఈయన్ను ఈ పేరుతో ఎవరూ పిలిచేవారు కారు. ఉద్యమం చేసిన తొలినాళ్లలో కేసీఆర్.. అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్! అన్నట్లుగానే ఉండేది. ముఖ్యంగా 2004లో కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. తరువాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వంలో చేరారు. ఉద్యమం పక్కనబెట్టి పదవులు అనుభవిస్తున్నారన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం నుంచి బయటికి వచ్చారు. తరువాత ఈ పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు రాజీనామాలు చేయడం, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం చాలా సాధారణ విషయంగా మారింది. 2006లో అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెస్సార్‌తో జరిగిన మాటల యుద్ధం కారణంగా కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తరువాత బంపర్ మెజారిటీతో గెలిచారు. మరోసారి 2008లో పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కొన్ని అసెంబ్లీ స్థానాలు కోల్పోయినా.. కేసీఆర్ మాత్రం గెలిచారు.
2009 నుంచి కేసీఆర్ పాలమూరు జిల్లా నుంచి ఎంపీగా గెలిచారు. మలిదశ ఉద్యమం ఊపందుకున్న తరువాత సీన్ మారింది. అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు. వీరికి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని తెలుగుదేశానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గెలవడంతో వీరి సంఖ్య 11కి పెరిగింది. ఇక అప్పటి నుంచి టీఆర్ ఎస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పార్టీలోకి ఇప్పటికీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఆ స్థానంలో కొత్తకోట ప్రభాకర్‌ను గెలిపించుకున్నారు. గతేడాది కడియం శ్రీహరితో వరంగల్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయించి.. ఆ స్థానంలో పసునూరి దయాకర్‌ను గెలిపించుకున్నారు. ఈ మధ్యకాలంలో.. కేసీఆర్ ఏనాడూ తన రాజీనామా మాట ఎత్తలేదు. సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు చేసుకున్న తరువాత బుధవారం తన రాజీనామా విషయాన్ని మళ్లీ చాలాకాలం తరువాత ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలను రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని బహిరంగ సవాలు విసిరారు. విజయంపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప కేసీఆర్ ఇలా రాజీనామా విషయం ప్రస్తావించరు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న కేసీఆర్ విసిరిన సవాలును అందుకునేందుకు ఇంతవరకూ కాంగ్రెస్ ముందుకు రాకపోవడం విశేషం.
Advertisement