అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా?
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సర్కారు ఇరుకున పడే అవకాశముందా? ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎస్.ఐ.లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా విధినిర్వహణలో పోలీసుల ఆత్మహత్యలు, ఉన్నతాధికారుల వేధింపులు వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతేసీరియస్‌గా ఉంది. ప్రధానంగా ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్.ఐ. అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య […]
Advertisement
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సర్కారు ఇరుకున పడే అవకాశముందా? ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎస్.ఐ.లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా విధినిర్వహణలో పోలీసుల ఆత్మహత్యలు, ఉన్నతాధికారుల వేధింపులు వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతేసీరియస్‌గా ఉంది. ప్రధానంగా ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్.ఐ. అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం. తాజాగా కుకునూరు పల్లిలో ఎస్.ఐ. రామక్రిష్ణా రెడ్డి సర్వీసు రివాల్వరుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం. తనను మామూళ్ల కోసం ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్య లేఖలో పేర్కొనడం ప్రభుత్వానికి పెద్ద మచ్చనే అంటించింది. ఆ తరువాత దీనిపై విచారణాధికారిగా నియమించిన నిజామాబాద్ ఏఎస్పీ ప్రతాపరెడ్డి ఓవరేక్షన్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది.
పోలీసు డిపార్టుమెంటులో జరుగుతోన్న ఆత్మహత్యలు వసూళ్ల పర్వానికి అద్దం పడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే, ఈసారి వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించాలని గట్టిగా డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం కొంచెం ముందే ఉంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్.ఐ. రామక్రిష్ణా రెడ్డి కుటుంబాన్ని ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామకృష్ణారెడ్డిది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఓ ఎస్.ఐ. సర్వీసు రివాల్వరుతో ఆత్మహత్య చేసుకోవడం అక్కడి వసూళ్ల పర్వానికి అద్దం పడుతోందన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకనే ఎస్.ఐ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య లేఖలో పేర్కొన్న నిందితులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement