అచ్చెన్నా చర్చకు రా... కేసీఆర్ అలర్ట్ అయ్యారు, విశాఖలో చంపినా దిక్కులేదు
నయీంతో మంత్రి అచ్చెన్నాయుడుకు లింకులున్నాయని ఈ విషయంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నట్టికుమార్ అన్నారు. ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడిన ఆయన అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తుంటే వాటిని నమ్మి తన సొంత జిల్లా శ్రీకాకుళంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకెళ్లానని నట్టికుమార్ చెప్పారు. నయీం మనుషులు దౌర్జన్యం చేసి లాక్కున్నారని చెప్పారు. పోలీసుల దగ్గరకు వెళ్తే ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇన్వాల్వ్ అయ్యారని […]
నయీంతో మంత్రి అచ్చెన్నాయుడుకు లింకులున్నాయని ఈ విషయంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నట్టికుమార్ అన్నారు. ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడిన ఆయన అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తుంటే వాటిని నమ్మి తన సొంత జిల్లా శ్రీకాకుళంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకెళ్లానని నట్టికుమార్ చెప్పారు. నయీం మనుషులు దౌర్జన్యం చేసి లాక్కున్నారని చెప్పారు. పోలీసుల దగ్గరకు వెళ్తే ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇన్వాల్వ్ అయ్యారని మ్యాటర్ సెటిల్ చేసుకోవాల్సిందిగా చెప్పారన్నారు.
ఒక రోజు విమానంలో అచ్చెన్నాయుడుతో ఇలా చేయడం న్యాయం కాదని విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. ఎస్పీయే తానేమీ చేయలేనని చేతులు ఎత్తేశారన్నారు. బాలకృష్ణను కలిసి పరిస్థితి చెప్పుకునేందుకు నాలుగు సార్లు ప్రయత్నించానని అయినా ఉపయోగం లేకపోయిందన్నారు. చంద్రబాబు కూడా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తాను ఇప్పుడు బయటకు వచ్చి ఇవన్నీ చెప్పడానికి కారణం ఉందన్నారు. ఎలాగో తనను చంపేస్తారని… మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఇప్పటికే చంపేసేవారని అన్నారు. ఇప్పుడు పబ్లిక్‌లోకి వచ్చినా మరో 10 రోజులకైనా చంపేస్తారన్నారు.
చావుకు తాను భయపడడం లేదన్నారు. కానీ సినీపరిశ్రమను కొందరు నాశనం చేస్తున్నారంటూ నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, సచిన్ జోషిపై ఆరోపణలు చేశారు. నయీం గ్యాంగు నుంచి ప్రమాదం ఉందని పోలీసుల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ వెంటనే అల్వాల్‌లో తన ఇంటికి భద్రత కల్పించారని చెప్పారు. కానీ విశాఖలో ఆరుగురి ముఠా నిన్న సాయంత్రం వచ్చి తన ప్లాట్‌ను వీడియో తీసుకుని వెళ్లారని … విశాఖలో ఒక మనిషిని చంపినా పట్టించుకునేవాడు లేడన్నారు నట్టికుమార్. తాను అడక్కపోయినా భద్రత కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అచ్చెన్నాయుడుకి నయీం గ్యాంగ్‌తో సంబంధాలున్న మాట వాస్తవమని మంత్రి చర్చకు వస్తే నిరూపిస్తానన్నారు నట్టికుమార్.
Click on Image to Read: