"మేము బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లం కాదు"- ఈ మాటలు వారికేనా...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి బహిరంగ లేఖ విడుదల చేశారు. తుని ఘటనలో పలువురు కాపులకు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. కాపు ఉద్యమ వార్తలపై ఆంక్షలు విధించిన చంద్రబాబు… కాపులకు నోటీసులు ఇస్తున్న విషయాన్ని మాత్రం మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ గమనిస్తుంటే కాపు జాతిపై ద్రోహులన్న ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నట్టుగా ఉందన్నారు. తామేమీ బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి తిరుగుతున్న ముద్దాయిలం కాదన్నారు. […]

Advertisement
Update:2016-08-22 06:50 IST

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి బహిరంగ లేఖ విడుదల చేశారు. తుని ఘటనలో పలువురు కాపులకు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. కాపు ఉద్యమ వార్తలపై ఆంక్షలు విధించిన చంద్రబాబు… కాపులకు నోటీసులు ఇస్తున్న విషయాన్ని మాత్రం మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ గమనిస్తుంటే కాపు జాతిపై ద్రోహులన్న ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నట్టుగా ఉందన్నారు. తామేమీ బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి తిరుగుతున్న ముద్దాయిలం కాదన్నారు.

రాజధానిలో పరిశ్రమల పేరుతో భూములు కాజేసిన వాళ్లం తాము కాదన్నారు. తీవ్రవాదులం అంతకన్నా కాదన్నారు. ఏ పోలీస్ అధికారి విచారణకు నోటీసులు పంపినా తీసుకోవాలని… అవసరమైతే బేడీలు వేసుకుని జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడాలని కాపులకు పిలుపునిచ్చారు. విచారణకు పిలిస్తే వెళ్లే ముందు 98480 38888, 98482 77199, 98497 41777 కు సమాచారం చేరవేయాలని ముద్రగడ కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసినవాళ్లం తాము కాదనడం ద్వారా ఒక సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌ లాంటి వారిని ఉద్దేశించే ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. రాజధానిలో భూములు కాజేసింది కూడా తాము కాదని ముద్రగడ విమర్శించడం వెనుక పెద్ద అర్థమే ఉందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News