నాకు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టుకు చేరింది. కేసు నుంచి నిందితుడు జెరూసలెం మత్తయ్య పేరును దిగువ కోర్టు తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని మత్తయ్య కోరారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. అయితే ఈసందర్భంగా మాట్లాడిన మత్తయ్య తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. చంద్రబాబు తనను బలిపశువును చేశారని వాపోయారు. చంద్రబాబు, టీఆర్‌ఎస్ […]
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టుకు చేరింది. కేసు నుంచి నిందితుడు జెరూసలెం మత్తయ్య పేరును దిగువ కోర్టు తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని మత్తయ్య కోరారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది.
అయితే ఈసందర్భంగా మాట్లాడిన మత్తయ్య తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. చంద్రబాబు తనను బలిపశువును చేశారని వాపోయారు. చంద్రబాబు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. చంద్రబాబు తనను వాడుకుని అవసరం తీరాక పట్టించుకోవడం మానేశారని మత్తయ్య ఆరోపించారు. చంద్రబాబుపై మత్తయ్య నేరుగా ఢిల్లీలో జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గతంలో నీకు ఏమీ కాదంటూ చంద్రబాబు జోల పాట పాడి ఇప్పుడు మాత్రం వదిలేశారని ఆవేదన చెందారు.
Click on Image to Read: