కోమటిరెడ్డి కుమారుడిది ప్రమాదం కాదు... మేమే హత్య చేశాం...

నరహంతకుడు నయీంకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఈనెల 17న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ ప్రస్తావన కూడా అందులో ఉంది. భువనగిరికి చెందిన గంప నాగేందర్ అనే వ్యాపారిని నయీం గ్యాంగు బెదిరించిన అంశానికి సంబంధించినది ఈ ఎఫ్ఐఆర్. అందులో ఫిర్యాదుదారుడు పలు కీలక అంశాలు చెప్పాడు. ఫిర్యాదులో గంపా నాగేందర్ ఏమి చెప్పారంటే “భువనగిరిలో నాకు రైస్ మిల్, […]

Advertisement
Update:2016-08-22 16:52 IST

నరహంతకుడు నయీంకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఈనెల 17న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ ప్రస్తావన కూడా అందులో ఉంది. భువనగిరికి చెందిన గంప నాగేందర్ అనే వ్యాపారిని నయీం గ్యాంగు బెదిరించిన అంశానికి సంబంధించినది ఈ ఎఫ్ఐఆర్. అందులో ఫిర్యాదుదారుడు పలు కీలక అంశాలు చెప్పాడు.

ఫిర్యాదులో గంపా నాగేందర్ ఏమి చెప్పారంటే “భువనగిరిలో నాకు రైస్ మిల్, పెట్రోల్ బంక్ ఉన్నాయి. మార్చి 8న పాశం శ్రీనివాస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నయీం అనుచరులం మాట్లాడుతున్నామని ఫోన్ లో తెలిపారు. వెంటనే నయీంను కలవాలని హెచ్చరించారు. 98661 44889 నెంబర్ నుంచి పాశం శ్రీనివాస్ కాల్ చేశాడు. అదే నెల 18న పాశం శ్రీను గ్యాంగ్ నన్ను తీసుకెళ్లింది. ఓ కారులో వచ్చి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద నుంచి తీసుకువెళ్లారు. మధ్యలో మరో కారులోకి నన్ను మార్చారు. చివరికి నయీం డెన్ కు తీసుకు వెళ్లారు. నయీం చుట్టూ తుపాకులు పట్టుకుని అమ్మాయిలిద్దరు ఉన్నారు.

తక్షణం రూ.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామన్నారు. బతిమలాడుకుంటే చివరికి రూ.కోటికి ఓకే చెప్పారు. ఏప్రిల్ 30లోగా డబ్బులు ఇవ్వకపోతే కొడుకుని చంపేస్తామని బెదిరించారు. హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొడుకును కూడా అలాగే చేశామని చెప్పారు. కోమటిరెడ్డి కొడుకును హత్యకేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించామని నయీం స్వయంగా చెప్పాడు. అయితే నయీం బెదిరింపులకు భయపడి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. అయినా వాళ్లు వదిలిపెట్టలేదు. మా పక్కింటి వారికి ఎమ్మెల్సీ విద్యాసాగర్‌ ఫోన్‌ కాల్ చేశారు. వెంటనే నయీంతో మాట్లాడాలని సూచించారు. అదేరోజు నయీం ఫోన్ చేసి తక్షణం రూ.కోటి ఇవ్వాలన్నాడు” అని పోలీసులకు గంపా నాగేందర్ తన ఫిర్యాదులో వివరించారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే… కోమటిరెడ్డి కుమారుడిని తామే హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించామని నయీం చెప్పాడనడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News