గ్రీన్ గ్రాడ్యుయేట్స్...ప‌ట్టామీద చెట్టుబొమ్మ‌!

చెట్ల పెంప‌కాన్నిప్రోత్స‌హించ‌డానికి, ప‌చ్చ‌ద‌నాన్ని ప‌దిల ప‌ర‌చ‌డానికి క‌ర్ణాటక ప్ర‌భుత్వం ఒక వినూత్న‌ప్ర‌యోగాన్ని చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్య‌ర్యంలో న‌డుస్తున్న 25 యూనివ‌ర్శిటీల్లో, 412 ప్ర‌భుత్వ క‌ళాశాలల్లో డిగ్రి లేదా పిజిలో చేరే ప్ర‌తి విద్యార్థి ఈ స‌రికొత్త ప‌థ‌కంలో భాగ‌స్వాముల‌వుతారు. విద్యార్థికి కాలేజిలో చేరుతున్న‌పుడు ఒక మొక్క‌ని ఇస్తారు. అత‌ను లేదా ఆమె ఆ మొక్క‌ని నాటి, త‌మ  కోర్సు పూర్త‌య్యే వ‌ర‌కు ఆ మొక్క‌ని సంర‌క్షించాలి. వారి చ‌దువు పూర్త‌య్యాక ఇచ్చే ప‌ట్టాపై…వారు  మొక్క‌గా నాటి […]

Advertisement
Update:2016-08-22 04:37 IST

చెట్ల పెంప‌కాన్నిప్రోత్స‌హించ‌డానికి, ప‌చ్చ‌ద‌నాన్ని ప‌దిల ప‌ర‌చ‌డానికి క‌ర్ణాటక ప్ర‌భుత్వం ఒక వినూత్న‌ప్ర‌యోగాన్ని చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్య‌ర్యంలో న‌డుస్తున్న 25 యూనివ‌ర్శిటీల్లో, 412 ప్ర‌భుత్వ క‌ళాశాలల్లో డిగ్రి లేదా పిజిలో చేరే ప్ర‌తి విద్యార్థి ఈ స‌రికొత్త ప‌థ‌కంలో భాగ‌స్వాముల‌వుతారు.

విద్యార్థికి కాలేజిలో చేరుతున్న‌పుడు ఒక మొక్క‌ని ఇస్తారు. అత‌ను లేదా ఆమె ఆ మొక్క‌ని నాటి, త‌మ కోర్సు పూర్త‌య్యే వ‌ర‌కు ఆ మొక్క‌ని సంర‌క్షించాలి. వారి చ‌దువు పూర్త‌య్యాక ఇచ్చే ప‌ట్టాపై…వారు మొక్క‌గా నాటి పెంచిన చెట్టు బొమ్మని ముద్రిస్తారు. దాంతోవారు గ్రీన్ గ్రాడ్యుయేట్స్ అవుతారు. ఉన్న‌త విద్యాశాఖా మంత్రి బ‌స‌వ‌రాజ్ రాయ‌రెడ్డి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. యూనివ‌ర్శిటీలు, ప్ర‌భుత్వ కాలేజీల‌కు… ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు ఒక తేదీని ఎంపిక చేసుకోమ‌ని చెప్పామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ ప‌థ‌కం ప్రకారం దాదాపు 20ల‌క్ష‌ల మంది విద్యార్థులు త‌మ కాలేజీల్లో లేదా యూనిర్శిటీ క్యాంప‌స్ లేదా ఆ ద‌గ్గ‌ర‌లో ఉన్న హైవేల మీద మొక్క‌ల‌ను నాటుతార‌ని బ‌స‌వ‌రాజు పేర్కొన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News