ఎక్కడ మన రాజధాని... వెలగపూడిలో భక్తుల బిత్తరచూపులు

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి త్రీడి బొమ్మలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నన్ను గెలిపిస్తే నా అనుభవాన్నంతా రాశిగా పోసి ఈ రేంజ్‌లో రాజధాని కడుతానంటూ పెద్దపెద్ద భవంతులను చంద్రబాబు త్రీడిలో చూపించారు. ఇప్పటికీ అమరావతి అనగానే జనం ఆ త్రీడి బొమ్మల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కడుతూనే ఉన్న తాత్కాలిక సచివాలయం విషయంలోనూ అంతే హైప్ క్రియేట్ చేశారు. వెలగపూడిలో సర్వం సిద్ధమైపోయిందని కలరింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులు బస్సుల్లో […]

Advertisement
Update:2016-08-21 15:57 IST

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి త్రీడి బొమ్మలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నన్ను గెలిపిస్తే నా అనుభవాన్నంతా రాశిగా పోసి ఈ రేంజ్‌లో రాజధాని కడుతానంటూ పెద్దపెద్ద భవంతులను చంద్రబాబు త్రీడిలో చూపించారు. ఇప్పటికీ అమరావతి అనగానే జనం ఆ త్రీడి బొమ్మల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కడుతూనే ఉన్న తాత్కాలిక సచివాలయం విషయంలోనూ అంతే హైప్ క్రియేట్ చేశారు. వెలగపూడిలో సర్వం సిద్ధమైపోయిందని కలరింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులు బస్సుల్లో తరలివెళ్తుంటే వారికి కన్నీటి వీడ్కోలు చెబుంటే అబ్బో ఆ దృశ్యాలు చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. మీడియాలో ఈ రేంజ్‌లో హైప్ చూసి జనం మైమరచిపోయారు.

ఇదే సమయంలో కృష్ణా పుష్కరాలు కూడా రావడంతో చాలామంది భక్తుల పక్కనే ఉన్న వెలగపూడికి వెళ్లి అద్భుతమైన రాజధానిని చూడాలనుకుంటున్నారు. అందుకే సొంతవాహనాల్లో వచ్చిన భక్తులు చాలా మంది అలా వెలగపూడి వైపు వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లి చూసి బిత్తరపోతున్నారు. ఎక్కడుంది మన కలల రాజధాని అని అవాక్కవుతున్నారు. సచివాలయం భవనాల్లో ఇంకా పనులు చేస్తుండడం, కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుండడం చూసి కంగుతింటున్నారు. అసలు అక్కడ ఉద్యోగులు కూడా కనిపించకపోవడంతో వారికి మరో అనుమానం కూడా వస్తోంది.

హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో కన్నీరు పెట్టుకుంటూ వచ్చిన మన ఉద్యోగులు ఇక్కడ లేకుండా ఎక్కడికి పోయారని అనుమానపడుతున్నారు. అసలు తాత్కాలిక రాజధాని వద్దకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేని పరిస్థితిని చూసి సందర్శనకు వచ్చిన జనానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చంద్రబాబు మాటలు, మీడియాలో త్రీడి బొమ్మలు చూసి మరీ ఇంతదారుణంగా భ్రమపడ్డామా అని తమ అమాయకత్వానికి తామే బాధపడుతూ వెనుదిరుగుతున్నారు. కొందరు యువకులు ప్రస్తుతం మేం అమరావతిలో ఉన్నాం. కానీ అచ్చం భ్రమరావతిలో ఉన్నట్టుగా ఉందంటూ జోకులేస్తున్నారు. పుష్కరాలకు సందర్శకులు వస్తున్న సమయంలోనే మంత్రులకు విశాలమైన చాంబర్ల కోసం గోడలను కూల్చివేస్తుండడం కూడా ప్రభుత్వం పరువును పక్కనే ఉన్న కృష్ణలో కలిపేస్తోంది. మొత్తం మీద కృష్ణాపుష్కరాలకు రావడం వల్ల తమకు పుణ్యం సంగతేమో గానీ… అమరావతి భ్రమలు తొలగిపోయాయంటూ ఆ అవకాశం కల్పించిన కృష్టమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు కొందరు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News