ఐఎంజీ భూములు, ఒలింపిక్స్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… సింధుకు రూ. 3కోట్ల నగదు పురస్కారం ఇస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా అమరావతిలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఎక్కువగా సహకరిస్తే తాను అంత త్వరగా అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. తాను ఆరోజు గోపిచంద్‌కు ఐదుఎకరాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ ప్రొడెక్ట్( సింధుకు పతకం) కూడా వచ్చి ఉండేది కాదన్నారు. […]
విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… సింధుకు రూ. 3కోట్ల నగదు పురస్కారం ఇస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా అమరావతిలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఎక్కువగా సహకరిస్తే తాను అంత త్వరగా అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. తాను ఆరోజు గోపిచంద్‌కు ఐదుఎకరాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ ప్రొడెక్ట్( సింధుకు పతకం) కూడా వచ్చి ఉండేది కాదన్నారు. వివాదాస్పదనమైన ఐఎంజీకి కూడా భూములు ఇచ్చింది తానేనని మీడియా సమావేశంలో చెప్పారు. ఆరోజు ఐఎంజీ అలాగే వచ్చి ఉంటే ఈ రోజు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చేదన్నారు.
ఐఎంజీ అన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా శిక్షణ సంస్థ అని చెప్పారు. గోపిచంద్ ఒక్కడే ఫ్యాకల్టీగా ఉన్నప్పటికీ సిల్వర్ వచ్చిందని అదే ఐఎంజీ వచ్చి మల్టీ ఫ్యాకల్టీతో శిక్షణ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఎన్ని పతకాలు వచ్చేవోనన్నారు. క్రీడలను ప్రోత్సహించింది గతంలో తానేనన్నారు. కరణం మల్లేశ్వరికి అప్పట్లోనే రూ. 25 లక్షలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు చంద్రబాబు.
అయితే.. 2020 ఒలింపిక్స్ టోక్యోలో నిర్వహించనున్నారు. 2024 ఒలింపిక్స్ కు బిడ్డింగ్ పూర్తయింది. ఇక మిగిలింది 2028 ఒలంపిక్సే. అది కూడా దేశం ప్రతిపాదించాలి గానీ ఒక రాష్ట్రం ఒలంపిక్స్ కోసం ప్రతిపాదించే అవకాశం ఉండదు.
పైగా ఒలంపిక్స్ నిర్వాహణకు లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒలంపిక్స్ నిర్వహించిన పది దేశాలు ఆ ఖర్చు దెబ్బకు దివాలా తీశాయి. అంతే కాకుండా తాత్కాలిక రాజధాని కోసం నాలుగు భవనాలు కట్టేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు… ఏకంగా అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. పైగా తాను ఆరోజు 5ఎకరాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ ప్రొడెక్ట్ కూడా వచ్చి ఉండేది కాదని చంద్రబాబు చెప్పడం సింధు కృషిని తగ్గించి చూపడమే అవుతుందేమో!.
Click on Image to Read: