వెలగపూడి సచివాలయంలో మొదలైన కూల్చివేతలు
తాత్కాలిక రాజధానిలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు చెట్ల కింద కూర్చోనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని భీకర గర్జనలు చేసిన టీడీపీ నాయకులు… ఇప్పుడు మంత్రుల హోదాలో తాత్కాలిక నిర్మాణాలను తిరస్కరించారు. మంత్రులైన తాము ఇలాంటి ఇరుకు గదుల్లో ఉండడం ఏమిటని మొండికేసే సరికి ఇప్పుడు కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గోడలకు సిమెంట్ కూడా ఆరకముందే కూల్చివేస్తున్నారు. చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని మంత్రులు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో శనివారం నుంచి తాత్కాలిక రాజధానిలోని చాంబర్ల గోడలను […]
తాత్కాలిక రాజధానిలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు చెట్ల కింద కూర్చోనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని భీకర గర్జనలు చేసిన టీడీపీ నాయకులు… ఇప్పుడు మంత్రుల హోదాలో తాత్కాలిక నిర్మాణాలను తిరస్కరించారు. మంత్రులైన తాము ఇలాంటి ఇరుకు గదుల్లో ఉండడం ఏమిటని మొండికేసే సరికి ఇప్పుడు కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గోడలకు సిమెంట్ కూడా ఆరకముందే కూల్చివేస్తున్నారు. చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని మంత్రులు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో శనివారం నుంచి తాత్కాలిక రాజధానిలోని చాంబర్ల గోడలను కూల్చివేస్తున్నారు. గోడలు కూల్చి మంత్రుల చాంబర్ల విస్తీర్ణం పెంచుతున్నారు. రెండో బ్లాక్, ఐదో బ్లాక్‌లోని మంత్రుల పెషీలను కూల్చివేస్తున్నారు. ఒక్కో చాంబర్‌కు అదనంగా 200 గజాలు విస్తీర్ణం పెంచుతున్నారు. కొన్ని చాంబర్లు ఇరుకుగా లేనప్పటికి పలువురు మంత్రులు వాస్తు లోపాలను ఎత్తిచూపారు. దీంతో వాటిని కూడా కూల్చి వాస్తు వైద్యం చేస్తున్నారు.
Click on Image to Read: