కవలలుగా పుడితే...అలా కలిసొస్తుందట!
ఒక్కరుగా జన్మించినవారికంటే కవలలుగా పుట్టినవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. ఆడా మగా ఇద్దరిలోనూ కవలలుగా పుట్టినవారిలో జీవితకాలం ఎక్కువగా ఉన్నట్టుగా ప్లాస్ వన్ అనే సైన్స్ జర్నల్లో ప్రచురించారు. వీరిలో మళ్లీ ఐడెంటికల్ ట్విన్స్ సాధారణ కవలలకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా తేలింది. ఐడెంటికల్ ట్విన్స్ అంటే సమరూప కవలలు. వీరు ఒకేరకం జీన్స్ కలిగి ఉంటారు…ఒకేరకంగా ఉంటారు…ఒక అండం, ఒక శుక్రకణం ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా ఏర్పడగా పుట్టినవారు….ఇద్దరూ ఆడా లేదా ఇద్దరూ […]
ఒక్కరుగా జన్మించినవారికంటే కవలలుగా పుట్టినవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. ఆడా మగా ఇద్దరిలోనూ కవలలుగా పుట్టినవారిలో జీవితకాలం ఎక్కువగా ఉన్నట్టుగా ప్లాస్ వన్ అనే సైన్స్ జర్నల్లో ప్రచురించారు. వీరిలో మళ్లీ ఐడెంటికల్ ట్విన్స్ సాధారణ కవలలకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా తేలింది. ఐడెంటికల్ ట్విన్స్ అంటే సమరూప కవలలు. వీరు ఒకేరకం జీన్స్ కలిగి ఉంటారు…ఒకేరకంగా ఉంటారు…ఒక అండం, ఒక శుక్రకణం ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా ఏర్పడగా పుట్టినవారు….ఇద్దరూ ఆడా లేదా ఇద్దరూ మగా అయి ఉంటారు. సాధారణ కవలలంటే…రెండు వేరువేరు అండాలు, రెండు వేరువేరు శుక్రకణాలతో కలవగా పుట్టినవారు. ఐడెంటికల్ కవలలు సాధారణ కవలలకంటే ఎక్కువకాలం బతికితే…సాధారణ కవలలు సింగిల్గా పుట్టినవారికంటే ఎక్కువకాలం జీవిస్తారని తేలిందని… వాసింగ్టన్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకుడు డేవిడ్ షారో అంటున్నారు.
కవలలకు సంబంధించిన వివరాలను నమోదు చేసే అత్యంత పురాతన కేంద్రం డానిష్ ట్విన్ రిజిస్ట్రి నుండి…డెన్మార్క్‌లో 1870-1900 మధ్యకాలంలో జన్మించిన కవలల వివరాలను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. తరువాత వారి మరణతేదీ ఆధారంగా…వారి జీవిత కాలాన్ని డెన్మార్క్ ప్రజల జీవిత కాలంతో పోల్చి చూసి… వారు ఎంత ఎక్కువకాలం జీవించారో పరిశీలించారు. 2,932 మంది కవల జంటలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. సింగిల్గా పుట్టినవారికంటే ట్విన్స్గా పుట్టినవారిలో…అదీ మగవారిలో ఆరుశాతం ఎక్కువగా జీవితకాలం ఉండటం గమనించారు. 45 ఏళ్లు దాటిన వయసులో ఈ ప్రయోజనం మరింత ఎక్కువగా ఉన్నట్టుగా చూశారు. 45 ఏళ్ల వయసులో సింగిల్గా పుట్టినవారు ప్రతి 100 మందికి 84మంది జీవించి ఉంటే…అదే కవలలగా పుట్టివారిలో ప్రతి 100మందిలో 90మంది జీవించి ఉన్నారు. జన్మను పంచుకున్న కవల సోదరి లేదా సోదరుడు జీవితకాలాన్ని పెంచడం మంచి విషయమే కదా.