బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం
బన్నీ మనకు ఇక్కడ అల్లు అర్జున్. కానీ కేరళలో మాత్రం ఇతడు మల్లు అర్జున్. ఈ హీరో సినిమాలు ఇక్కడే కాదు… కేరళలో కూడా బ్రహ్మాండంగా ఆడుతాయి. తాజాగా విడుదలైన సరైనోడు సినిమా అయితే కేరళలో ఏకంగా 8కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అందుకే బన్నీకి మలయాళీలంటే ప్రత్యేకమైన ఇష్టం. అటు మలయాళీలు కూడా బన్నీపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంటారు. ఈ బంధాన్ని మరింత బలపరుచుకునేందుకు ఇప్పుడు ఏకంగా బన్నీకి ప్రవాసి రత్న పురస్కారాన్ని అందజేశారు. స్టార్ […]
బన్నీ మనకు ఇక్కడ అల్లు అర్జున్. కానీ కేరళలో మాత్రం ఇతడు మల్లు అర్జున్. ఈ హీరో సినిమాలు ఇక్కడే కాదు… కేరళలో కూడా బ్రహ్మాండంగా ఆడుతాయి. తాజాగా విడుదలైన సరైనోడు సినిమా అయితే కేరళలో ఏకంగా 8కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అందుకే బన్నీకి మలయాళీలంటే ప్రత్యేకమైన ఇష్టం. అటు మలయాళీలు కూడా బన్నీపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంటారు. ఈ బంధాన్ని మరింత బలపరుచుకునేందుకు ఇప్పుడు ఏకంగా బన్నీకి ప్రవాసి రత్న పురస్కారాన్ని అందజేశారు.
స్టార్ ఏషియానెట్ మిడిల్ ఈస్ట్ అల్లు అర్జున్ కు ప్రవాసి రత్న పురస్కారం ప్రకటించింది. నిన్న సాయంత్రం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఓనం పండుగ సందర్భంగా జరిగిన పూనోనమ్ -2016 అనే కార్యక్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దుబాయ్ లోని మలయాళీ ప్రజలు, ఇతర ప్రముఖుల సమక్షంలో అల్లు అర్జున్ కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్బంగా బన్నీ దుబాయ్ లో ఉన్న మలయాళీలకు థ్యాంక్స్ చెప్పారు. అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపారు.