పుష్కరాల్లో హెరిటేజ్ "ఫ్రీ" పులకింత

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీపీఎం నేతలు పెదవి విరిచారు. కార్మికులతో గొడ్డుచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో పార్టీ నేతలు విజయవాడలోని పలుఘాట్లను పరిశీలించారు. కార్మికులు, భక్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పుష్కరాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎనిమిది గంటల పనికి రూ. 300 ఇస్తామని చెప్పారని… కానీ ఏడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని వాపోయారు. కేవలం […]

Advertisement
Update:2016-08-18 10:57 IST

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీపీఎం నేతలు పెదవి విరిచారు. కార్మికులతో గొడ్డుచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో పార్టీ నేతలు విజయవాడలోని పలుఘాట్లను పరిశీలించారు. కార్మికులు, భక్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పుష్కరాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎనిమిది గంటల పనికి రూ. 300 ఇస్తామని చెప్పారని… కానీ ఏడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని వాపోయారు. కేవలం భోజనం మాత్రమే పెడుతున్నారని కార్మికులు సీపీఎం నాయకులతో చెప్పుకున్నారు.

ఇప్పుడు మాత్రం 16 గంటలు పనిచేస్తేనే రూ. 300 ఇస్తామంటున్నారని పద్మావతి ఘాట్‌లో పనిచేస్తున్న కార్మికులు వెల్లడించారు. పుష్కరాల్లో చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని మధు విమర్శించారు. సీపీఎం నేతలకు మరో అసక్తికరమైన దృశ్యం కూడా కనిపించింది. ఘాట్ల దగ్గరకు కార్మికులు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ టీ షర్ట్‌లు వేసుకుని కనిపించారు. దీనిపై సీపీఎం నేతలు ఆరా తీశారు. హెరిటేజ్ వాళ్లు వేసుకోవాల్సిందిగా చెబితే తాము వేసుకున్నామని కార్మికులు వివరించారు. ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్న పుష్కరాల్లోనూ చంద్రబాబు తన సొంత కంపెనీకి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవడం ఏమిటని సీపీఎం నేతలు విమర్శించారు. జీతాలిచ్చేది మున్సిపాలిటీ అయితే… ఉచిత ప్రచారం మాత్రం హెరిటేజ్ కంపెనీకా అని ఎద్దేవా చేశారు. పుష్కరాల్లో బాగా పనిచేస్తున్నారని కార్మికులు, పోలీసులను సీపీఎం నేత మధు అభినందించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News