కేసీఆర్ సర్కారుకు పొంచి ఉన్న మరో ముప్పు!
కేసీఆర్ ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా న్యాయ చిక్కులు, అవాంతరాలు తప్పడం లేదు. వీసీల నియామకం, మల్లన్న సాగర్ భూసేకరణ.. ఇలా ఏ పని తలపెట్టినా.. ఎవరో ఒకరు దానిపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకు వెళ్లడం.. అక్కడ ప్రభుత్వానికి చిక్కెదురవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే న్యాయస్థానం వేస్తోన్న వరుస మొట్టికాయలతో తలబొప్పి కట్టిన సర్కారుకు మరో కొత్తజిల్లాల రూపంలో ముప్పు పొంచి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ సర్కారు దూకుడుగానే ముందుకు పోతోంది. […]
Advertisement
కేసీఆర్ ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా న్యాయ చిక్కులు, అవాంతరాలు తప్పడం లేదు. వీసీల నియామకం, మల్లన్న సాగర్ భూసేకరణ.. ఇలా ఏ పని తలపెట్టినా.. ఎవరో ఒకరు దానిపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకు వెళ్లడం.. అక్కడ ప్రభుత్వానికి చిక్కెదురవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే న్యాయస్థానం వేస్తోన్న వరుస మొట్టికాయలతో తలబొప్పి కట్టిన సర్కారుకు మరో కొత్తజిల్లాల రూపంలో ముప్పు పొంచి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ సర్కారు దూకుడుగానే ముందుకు పోతోంది. కొత్త జిల్లాల ఆవశ్యకత, ప్రామాణికతపై పలుమార్లు ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించినా.. వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారు సూచించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ విషయంలో సర్కారు మొండి వైఖరి అవలంబిస్తోందని, అవసరం లేకున్నా.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. హైకోర్టును ఆశ్రయించాలని టీపీసీసీ నిర్ణయించింది. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కొబ్బరికాయ కొడదామని అంతా సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఇది భారీ కుదుపునే ఇవ్వనుంది. ఇటీవల మల్లన్నసాగర్ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అదే ఊపుతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్‌లో జరిగిన రైతు గర్జనలో టీపీసీసీ ముఖ్యనేతలంతా తీర్మానం చేసి ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో రేపో, మాపో తెలంగాణ సర్కారు మరో ఉపద్రవాన్ని ఎదుర్కోబోతుందన్నమాట! ఈ గండం నుంచి సర్కారు ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి!
Advertisement