తలుపులు లేవు, తారీఖులు లేవు.. అక్కడంతా బహిర్గతమే
చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణ పుష్కరాల్లో పనుల నాణ్యతపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పద్మావతి ఘాట్‌ను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు నేతృత్వంలో సీపీఎం నేతలు పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మహిళలు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులకు తలుపులు లేకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు కూడా తలుపులు ఇరిగిపడి ఉన్నాయని నేతలు మండిపడ్డారు. భక్తులకు ఇస్తున్న వాటర్ […]
చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న కృష్ణ పుష్కరాల్లో పనుల నాణ్యతపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పద్మావతి ఘాట్‌ను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు నేతృత్వంలో సీపీఎం నేతలు పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మహిళలు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులకు తలుపులు లేకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు కూడా తలుపులు ఇరిగిపడి ఉన్నాయని నేతలు మండిపడ్డారు. భక్తులకు ఇస్తున్న వాటర్ ప్యాకెట్లపై తేదీ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వందల కోట్లు పెట్టి వేయించిన టైల్స్ అప్పుడే ఇరిగిపోయి కనిపించాయి. సీపీఎం నాయకుల వద్ద కార్మికులు కూడా తమ గోడువెల్లబోసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసాకూడా తమకు చెల్లించలేదని కార్మికులు వివరించారు. భోజనం మాత్రమే పెడుతున్నారని సీపీఎం నేతలకు కార్మికులు వివరించారు.
Click on Image to Read: