కోదండ‌రాం ఫోన్ ట్యాప్ !

టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం – ప్ర‌భుత్వం మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ప‌తాక స్థాయికి చేరింది. కొంత‌కాలంగా త‌న ఫోన్ ట్యాపింగ్ కు గుర‌వుతోంద‌ని కోదండ‌రాం ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. మొన్నా మ‌ధ్య మాపై పోలీసులు నిఘా పెడుతున్నార‌ని కోదండ‌రాం ఆరోపించిన సంగ‌తి తెలిసిందే! తాజాగా జేఏసీ స‌భ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో త‌న ఫోన్ ట్యాప్ అయింద‌ని ఆరోపించాడు. ఈ విష‌యంపై కొంత‌కాలంగా త‌న‌కు అనుమానాలు క‌లిగినా.. స‌రైన ఆధారాలు లేక‌నే బ‌య‌టికి వెల్ల‌డించ‌లేద‌ని తెలిపాడు. […]

Advertisement
Update:2016-08-16 03:38 IST

టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం – ప్ర‌భుత్వం మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ప‌తాక స్థాయికి చేరింది. కొంత‌కాలంగా త‌న ఫోన్ ట్యాపింగ్ కు గుర‌వుతోంద‌ని కోదండ‌రాం ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. మొన్నా మ‌ధ్య మాపై పోలీసులు నిఘా పెడుతున్నార‌ని కోదండ‌రాం ఆరోపించిన సంగ‌తి తెలిసిందే! తాజాగా జేఏసీ స‌భ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో త‌న ఫోన్ ట్యాప్ అయింద‌ని ఆరోపించాడు. ఈ విష‌యంపై కొంత‌కాలంగా త‌న‌కు అనుమానాలు క‌లిగినా.. స‌రైన ఆధారాలు లేక‌నే బ‌య‌టికి వెల్ల‌డించ‌లేద‌ని తెలిపాడు. ఇప్పుడు పూర్తి స‌మాచారం సేక‌రించాకే.. ఈ విషయాన్ని లోకానికి తెలియ‌జేస్తున్నట్లు తెలిపారు. పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్న తాము ఈ విష‌యంలో ఎవ‌రికీ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. కానీ, ఒక వ్య‌క్తికి రాజ్యాంగం ప్ర‌సాదించిన వాక్‌, రాజ్యాంగ హ‌క్కుల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం కాల‌రాస్తోంద‌ని ఆరోపించారు.

కొంత‌కాలంగా ఉప్పు- నిప్పులా ఉంటోన్న స‌ర్కారు – టీజేఏసీ మ‌ధ్య మాట‌ల పోరు రోజురోజు కు ముదురుతోంది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో త‌న వంతుగా అభ్యంత‌రాల‌ను తెలియ‌జేస్తోంది జేఏసీ. ఈ విష‌యంలో స‌ర్కారు త‌మ‌పై క‌క్ష గ‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కోదండ‌రాం అన్నారు. తెలంగాణ‌లో ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం ద‌స‌రా నుంచి కొత్త ఉద్య‌మం మొద‌లు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వానికి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న సింగ‌రేణి, ఇత‌ర ప్ర‌భుత్వశాఖ‌ల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. ఈ కార్య‌క్రమాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు ప్ర‌భుత్వం మాపై నిఘా కొన‌సాగిస్తోంద‌ని కోదండ‌రాం ఆరోపిస్తున్నారు. పార‌ద‌ర్శ‌కంగా చేసే ఈ ప‌నుల‌ను ప్ర‌భుత్వం ముంద‌స్తుగా తెలుసుకున్నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, వ్య‌క్తిగ‌త హ‌క్కులకు విఘాతం క‌లిగించ‌డం త‌గ‌ద‌ని కేసీఆర్ కు హిత‌వు ప‌లికారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News