సిఫార్సులను ఆమోదించడమే శ్రీలక్ష్మి తప్పా?

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ కేసులో ఇంతకు ముందు 9మందిని నిందితులుగా చేర్చినా సీబీఐ ఇప్పుడు మరో ఏడుగురి పేర్లను చేర్చింది. కర్నూలు జిల్లాలో 304.70 హెక్టార్లలో మైనింగ్‌ లీజు కోసం అల్ట్రాటెక్ సిమెంట్‌ కంపెనీ దరఖాస్తు చేసుకోగా దాన్ని పక్కన పెట్టి పెన్నా సిమెంట్స్‌కు మైన్స్‌ కేటాయించారన్నది సీబీఐ అభియోగం. అయితే ఈ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిని సీబీఐ ఏ-15గా చేర్చింది. ఆమెపై సీబీఐ చేసిన […]

Advertisement
Update:2016-08-16 05:13 IST

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ కేసులో ఇంతకు ముందు 9మందిని నిందితులుగా చేర్చినా సీబీఐ ఇప్పుడు మరో ఏడుగురి పేర్లను చేర్చింది. కర్నూలు జిల్లాలో 304.70 హెక్టార్లలో మైనింగ్‌ లీజు కోసం అల్ట్రాటెక్ సిమెంట్‌ కంపెనీ దరఖాస్తు చేసుకోగా దాన్ని పక్కన పెట్టి పెన్నా సిమెంట్స్‌కు మైన్స్‌ కేటాయించారన్నది సీబీఐ అభియోగం. అయితే ఈ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిని సీబీఐ ఏ-15గా చేర్చింది. ఆమెపై సీబీఐ చేసిన ఆరోపణ ఏమిటంటే… మైనింగ్ లీజు విషయంలో గనుల శాఖ సర్వే కూడా చేసిందట. అలా సర్వే చేసిన గనులశాఖ 304. 74 హెక్టార్లను పెన్నా సిమెంట్స్‌కు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి యథాతథంగా ఆమోదించారు. ఇదే ఆమె చేసిన నేరం అంటోంది సీబీఐ.

గనుల శాఖ సిఫార్సు చేసినప్పటికీ ముందే దరఖాస్తు చేసుకున్న అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ను కాదని పెన్నా సిమెంట్స్‌కు మైన్స్‌ కేటాయించడం నేరమని సీబీఐ చెబుతోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెన్నా సిమెంట్స్‌ మైనింగ్ కేటాయింపు ఫైల్‌ను పంపించలేదని సీబీఐ అదనపు చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. పర్యావరణ శాఖ అనుమతులు కూడా రాకముందే పెన్నా సిమెంట్స్‌కు శ్రీలక్ష్మి మైనింగ్ లీజును ఓకే చేశారని కూడా సీబీఐ ఆరోపించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News