త‌న చావును న‌యీం ముందే ఊహించాడా?

తాను మ‌ర‌ణించినా.. త‌న‌తోపాటు మ‌రికొంద‌రూ చావాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం న‌యీంది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో తాను పోలీసుల‌కు దొరికినా లేదా ఆక‌స్మికంగా మ‌ర‌ణించినా.. త‌న‌తోపాటు త‌న నేరాల్లో పాలుపంచుకున్న వారంద‌రినీ ఇరికించాల‌ని ప్లాన్ వేశాడు న‌యీం. త‌న‌ను గ్యాంగ్‌స్ట‌ర్‌గా మార్చిన అధికారుల నుంచి మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌తో ట‌చ్‌లో ఉన్న పోలీసులంద‌రితో సాగించిన సంభాష‌ణ‌లను ముందుజాగ్ర‌త్త‌గా రికార్డు చేశాడు.   అలాగే పోలీసు అధికారులకు, రాజకీయనాయకులకు గోవా తదితర ప్రాంతాల్లో ఖరీదైన పార్టీలు ఇచ్చినపుడు మందు, మగువలను […]

Advertisement
Update:2016-08-15 05:39 IST
తాను మ‌ర‌ణించినా.. త‌న‌తోపాటు మ‌రికొంద‌రూ చావాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం న‌యీంది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో తాను పోలీసుల‌కు దొరికినా లేదా ఆక‌స్మికంగా మ‌ర‌ణించినా.. త‌న‌తోపాటు త‌న నేరాల్లో పాలుపంచుకున్న వారంద‌రినీ ఇరికించాల‌ని ప్లాన్ వేశాడు న‌యీం. త‌న‌ను గ్యాంగ్‌స్ట‌ర్‌గా మార్చిన అధికారుల నుంచి మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌తో ట‌చ్‌లో ఉన్న పోలీసులంద‌రితో సాగించిన సంభాష‌ణ‌లను ముందుజాగ్ర‌త్త‌గా రికార్డు చేశాడు.
అలాగే పోలీసు అధికారులకు, రాజకీయనాయకులకు గోవా తదితర ప్రాంతాల్లో ఖరీదైన పార్టీలు ఇచ్చినపుడు మందు, మగువలను కూడా ఏర్పాటు చేశాడు. ఆ తతంగమంతటినీ కూడా వీడియోలు తీసి సీడీలుగా భద్రపరిచాడు. అవి ఇప్పుడు పోలీసులకు దొరికాయి. కేసీఆర్ ప్రభుత్వం చాలా నిజాయితీగా వ్యవహరిస్తే పదుల సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, పెద్ద స్థాయిలో వున్న జర్నలిస్ట్ బాసులు తదితరులు కోర్టు గుమ్మం ఎక్కే అవకాశం ఉంది.
ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, పోలీసుల‌కు సంబంధించిన అమాయ‌కుల నుంచి లాక్కున్న భూములు, వాటిని ఎవ‌రి పేరున బ‌ద‌లాయించారు? వాటి అస‌లు భూ య‌జ‌మానుల‌కు సంబంధించిన భూప‌త్రాల‌ను జిరాక్సు కాపీలు త‌న వ‌ద్ద‌ ఉంచుకున్నాడు. ఇలాంటివి న‌యీం ఇంట్లో దాదాపు 650 భూ ప‌త్రాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక‌పోతే పోలీసు ఉన్నాతాధికారుల‌తో న‌యీం సాగించిన సంభాష‌ణ‌ల తాలూకు సీడీలు న‌యీం గ‌దిలో క‌ట్ట‌లుక‌ట్ట‌లుగా దొరికాయి. వీటితోపాటు ఏ అధికారితో ఎప్పుడు, ఏ తేదీన మాట్లాడాడో తెలుగులోనే రాసుకున్నాడు న‌యీం.
న‌యీం అక్ర‌మంగా సంపాదించిన ఆస్తుల‌కు సంబంధించి ఓ చార్టెడ్ అకౌంటెంట్ ను నియ‌మించుకున్నాడు. త‌న భార్యాపిల్ల‌ల పేర్ల‌తో కేవ‌లం రెండు, మూడు ఇళ్ల‌ను మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ చేయించాడు. ఒక‌వేళ తాను మ‌ర‌ణించినా త‌న కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్ర‌త్త‌గా ఇలా త‌క్కువ ఆస్తులు రిజిస్ర్టేష‌న్ చేయించాడు. కానీ త‌న బినామీలైన ఫ‌ర్హానా పేరిట రూ.250 కోట్లు, శేష‌న్న పేరిట రూ.250 కోట్లు కు పైగా విలువైన ఆస్తుల‌ను రిజిస్ర్టేష‌న్ చేయించాడు. అలాగే త‌న‌తోపాటు లావాదేవీలు, సెటిల్‌మెంట్లు, హ‌త్య‌ల్లో పాలు పంచుకున్న వారి మొత్తం వివ‌రాల‌ను న‌యీం ప‌క్కాగా డైరీలో రాసుకున్నాడు. భ‌విష్య‌త్తులో తాను అరెస్టు కావ‌చ్చు లేదా మ‌ర‌ణించ‌వ‌చ్చు. ఒక‌వేళ అరెస్టయితే త‌న వ‌ద్ద‌నున్న ఆధారాల‌తో పోలీసు ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కుల‌కు స‌ద‌రు ఆధారాలు పంపి బ్లాక్ మెయిల్ చేయ‌వ‌చ్చు. ఇందుకోసం మాఫియాతో సంబంధ‌మున్న ముగ్గురు పేరుమోసిన లాయ‌ర్ల‌తోనూ ముంద‌స్తుగానే సంప్ర‌దింపులు జ‌రిపాడు. లేదా తాను మ‌ర‌ణిస్తే.. త‌న‌తోపాటు అంతా జైలుకు వెళ్లాల్సిందే. ఈ త‌తంగం మొత్తం లోకానికి తెలియాల‌న్న‌దే న‌యీం డైరీ రాయ‌డం వెన‌కున్న అస‌లైన ఆంత‌రంగం అని పోలీసులు చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News