నయీం కేసులో పోలీసుల అరెస్టు!
నయీం పాపాల పుట్ట క్రమంగా బద్దలవుతోంది. ఇంతకాలం అతనికి పోలీసులే సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. నయీం బతికున్నపుడు అతనికి సహకరించిన పోలీసుల చిట్టా దొరికింది. నయీం చేసిన అక్రమాలు, నేరాలు, కబ్జాలకు సహకరించిన వీరిలో కొందరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుందని విశ్వసనీయ సమాచారం. నయీం వద్ద లభించిన డైయిరీ, అతని కాల్ డేటా ఆధారంగా మొత్తం నలుగురు పోలీసు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురిని తెలంగాణలో అదుపులోకి తీసుకోగా..మరో మాజీ ఉన్నతాధికారిని బెజవాడలో […]
Advertisement
నయీం పాపాల పుట్ట క్రమంగా బద్దలవుతోంది. ఇంతకాలం అతనికి పోలీసులే సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. నయీం బతికున్నపుడు అతనికి సహకరించిన పోలీసుల చిట్టా దొరికింది. నయీం చేసిన అక్రమాలు, నేరాలు, కబ్జాలకు సహకరించిన వీరిలో కొందరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుందని విశ్వసనీయ సమాచారం. నయీం వద్ద లభించిన డైయిరీ, అతని కాల్ డేటా ఆధారంగా మొత్తం నలుగురు పోలీసు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురిని తెలంగాణలో అదుపులోకి తీసుకోగా..మరో మాజీ ఉన్నతాధికారిని బెజవాడలో అరెస్టు చేసినట్లు సమాచారం. ఇతను ఆరేళ్ల క్రితం బెజవాడలో ఏసీపీగా పనిచేసి పదవీవిరమణ పొందారని సమాచారం. సదరు ఉద్యోగి నల్లగొండలో సీఐగా ఉన్నపుడు నయీంకు చాలా నేరాల్లో సహకరించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. నయీం చేసే నేరాల్లో ఇచ్చిన తాయిలాలను ఇతనూ అప్పటి నల్లగొండ ఎస్పీ పంచుకునేవారని సమాచారం. పోలీసు అధికారులు ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు. రాబోయే రోజుల్లో మరో 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ అధికారులంతా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పరిధిలో విధులునిర్వహించిన పోలీసులే కావడం గమనార్హం.
Advertisement