రేవంత్ రెడ్డిని న‌యీం టార్గెట్ చేశాడా?  

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌చారం న‌డుస్తోంది. తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని న‌యీం గ్యాంగ్ టార్గెట్ చేసిందా? అత‌న్ని చంపాల‌ని చూసిందా? అన్న ప్ర‌శ్న‌ల‌తో ఓ క‌థ‌నం వైర‌ల్‌గా మారింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం.. రేవంత్ రెడ్డిని హ‌త‌మార్చేందుకు న‌యీం గ్యాంగ్ కొంత‌కాలంగా ప్ర‌ణాళిక‌లు రచిస్తోంది. ఇందుకోసం హైద‌రాబాద్ – పాల‌మూరు మ‌ధ్య‌లోనే చ‌క్క‌ర్లు కొడుతోంది.  త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే ఆరోపించ‌డం వెన‌క కార‌ణం ఇదేన‌ని […]

Advertisement
Update:2016-08-13 02:20 IST
సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌చారం న‌డుస్తోంది. తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని న‌యీం గ్యాంగ్ టార్గెట్ చేసిందా? అత‌న్ని చంపాల‌ని చూసిందా? అన్న ప్ర‌శ్న‌ల‌తో ఓ క‌థ‌నం వైర‌ల్‌గా మారింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం.. రేవంత్ రెడ్డిని హ‌త‌మార్చేందుకు న‌యీం గ్యాంగ్ కొంత‌కాలంగా ప్ర‌ణాళిక‌లు రచిస్తోంది. ఇందుకోసం హైద‌రాబాద్ – పాల‌మూరు మ‌ధ్య‌లోనే చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే ఆరోపించ‌డం వెన‌క కార‌ణం ఇదేన‌ని చెప్పుకుంటున్నారు.
అయితే లోకం మొత్తం ఇది తెలంగాణ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లేందుకు రేవంత్ రెడ్డి చేస్తోన్న సాధార‌ణ ఆరోప‌ణ‌గానే భావించింది. కానీ, న‌యీమ్ టీడీపీనేత రేవంత్ పై పీక‌ల్లోతు కోపం పెంచుకున్నాడ‌ని, అత‌న్ని చంపేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది. అందుకోసం రేవంత్ రెడ్డి నివాసం స‌మీపంలో రెక్కీ కూడా నిర్వ‌హించాడ‌ట‌. ఈ విష‌యాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి త‌న‌కు ర‌క్ష‌ణ పెంచాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వంతో యుద్ధ‌మే చేశాడు. అయితే నయీంతో చంద్రబాబుకు బాగా దగ్గరి సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ ను టార్గెట్ చేయడం వెనుక టీడీపీ పెద్దల హస్తం కూడా ఉందా అన్న అనుమానాన్ని మరికొందరు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు.. ఆ నేరాన్ని సీఎం కేసీఆర్‌పైనే మోపాల‌ని ప్లాన్ చేశాడంట‌. సాధార‌ణంగా న‌యీం త‌న ఉనికికి ఎస‌రు వ‌స్తుంద‌న్న ఆందోళ‌న‌తో లొంగిపోయిన న‌క్స‌లైట్ల‌నే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తాడు. సోలిపేట రామలింగారెడ్డి, పైళ్ల రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వేముల వీరేశంల‌ను కూడా న‌యీం బెదిరించ‌డానికి కార‌ణం ఇదే! మ‌రి రేవంత్ రెడ్డిపై న‌యీక్ క‌క్ష పెంచుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అన్న విష‌యం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News