ఇంత ప్లాన్‌ ఉందా బాబూ!

ఆంధ్రప్రదేశ్‌లో చిల్లర రాజకీయాలు పతాక స్థాయిలో నడుస్తున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరినైనా పిలవడం ఇష్టం లేకపోతే సాధారణంగా ఆహ్వానించకుండా వదిలేస్తారు. కానీ బుద్ది ఉన్న వారు ఎవరూ కార్యక్రమం మొదలయ్యాక వెళ్లి ఆహ్వానం ఇవ్వరు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ఘనత కూడా సాధించింది. పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ ఇంటికి మంత్రి రావెల కిషోర్ బాబు, కూన రవికుమార్‌ను చంద్రబాబు పంపించారు. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానించడం ఏమిటని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం […]

Advertisement
Update:2016-08-13 03:17 IST

ఆంధ్రప్రదేశ్‌లో చిల్లర రాజకీయాలు పతాక స్థాయిలో నడుస్తున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరినైనా పిలవడం ఇష్టం లేకపోతే సాధారణంగా ఆహ్వానించకుండా వదిలేస్తారు. కానీ బుద్ది ఉన్న వారు ఎవరూ కార్యక్రమం మొదలయ్యాక వెళ్లి ఆహ్వానం ఇవ్వరు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ఘనత కూడా సాధించింది. పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ ఇంటికి మంత్రి రావెల కిషోర్ బాబు, కూన రవికుమార్‌ను చంద్రబాబు పంపించారు. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానించడం ఏమిటని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆహ్వానం వెనుక కూడా చంద్రబాబు చిల్లర రాజకీయం ఉందని భావిస్తున్నారు.

గతంలో అమరావతి శంకుస్థాపనకు జగన్‌ను ఆహ్వానించేందుకు మంత్రికామినేని నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. అయితే నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ జరుగుతున్న కార్యక్రమంలో తాను భాగస్వామిని కాలేనంటూ జగన్ నిరాకరించారు. ఈసారి పుష్కరాలకు ఆహ్వానించేందుకు దళితుడైన రావెల కిషోర్‌బాబును చంద్రబాబు పంపించారు. దళితుడైనా మరో వర్గం వాడైనా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమలాపురం పర్యటన కారణంగా శుక్రవారం రాత్రి జగన్‌ అపాయింట్మెంట్‌ రావెలకు దొరకలేదు. ఇంతలోనే చంద్రబాబు లీకు ఛానల్‌ కొత్త లైన్ తీసుకుంది. దళితుడైన రావెలను జగన్ అవమానించారంటూ రాత్రే హోరెత్తించింది. దళిత మంత్రి ఆహ్వానిస్తున్నారన్న భావనతోనే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చింది.

పుష్కరాలు ప్రారంభమయ్యాక ఇచ్చే ఆహ్వానాన్ని జగన్‌ ఎలాగో అంగీకరించరని ముందే ఊహించిన ప్రభుత్వ పెద్దలు… జగన్‌ దళిత మంత్రిని అవమానించారన్న నింద వేయడానికే చంద్రబాబు ఇలా రావెల కిషోర్‌బాబును పంపారని చెబుతున్నారు. పైగా ఇటీవల అమలాపురంలో దాడులకు గురైన దళితులను జగన్‌ శుక్రవారమే పరామర్శించారు. దళితులపై దాడి విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇరుకున పడింది. అదే సమయంలో జగన్‌ పరామర్శించడం ద్వారా తామున్నామన్న భావన వారిలో కల్పించారన్న అభిప్రాయం ఏర్పడింది. దీనికి విరుగుడుగానే జగన్‌కు దళితులంటే చిన్నచూపు అని ప్రచారం చేసేందుకే ఏరికోరి రావెల కిషోర్ బాబును జగన్‌ ఇంటికి చంద్రబాబు పంపినట్టుగా ఉన్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు కామినేని వచ్చారు. అప్పుడుకూడా జగన్ నిరాకరించారు. అప్పుడు మాత్రం జగన్… కామినేని కులాన్నిచూసి అవమానించారని ప్రచారం చేయకపోవడం బాబు మీడియా గొప్పతనమే.

నెలరోజులనుంచి మంత్రులు, ముఖ్యమంత్రి ఇంట్లో పెళ్లి అన్నట్టు పుష్కరాలకు ఆహ్వానపత్రాలు పట్టుకుని దేశమంతా తిరిగి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి తనకు కావాల్సిన మంత్రులను, న్యాయమూర్తులను, తదితరులను ఆహ్వానించారు. పల్లె రఘునాధరెడ్డి వారంరోజులపాటు సినీనటీనటుల ఇళ్లకు పేరుపేరునా వెళ్లి ఆహ్వానించాడు. మంత్రులు వాళ్ల స్థాయిలో ఆహ్వానాలు పలికారు. కానీ ప్రతిపక్ష నాయకుడిని మాత్రం ఎవరూ ఆహ్వానించలేదు. పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్ హైదరాబాద్ లో లేకుండా రాజమండ్రి వెళ్లిన శుభసందర్భం చూసుకొని జగన్ ని ఆహ్వానించడానికి వెళ్లారు. నీచ రాజకీయాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. అలాంటి హద్దులన్నిటినీ చెరిపేయగల ఒకేఒక మహా రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News