చెన్నమనేనిపై వేలాడుతున్న పౌరసత్వం కత్తి!
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మెడపై పౌరసత్వం కత్తి వేలాడుతోంది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఎమ్మెల్యేగా అతను అనర్హుడంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించి దీనిపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రాన్ని ఆదేశించడమే ఇందుకు కారణం. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నివేదికపై చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై స్పష్టత రానుంది. చెన్నమనేని పౌరసత్వం వివాదంపై ఇటు సొంత పార్టీలోనూ చర్చ మొదలైంది. రాష్ట్ర మంతా నయీం హడావుడిలో పడి ఈ విషయానికి మీడియాలో అంతగా […]
Advertisement
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మెడపై పౌరసత్వం కత్తి వేలాడుతోంది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఎమ్మెల్యేగా అతను అనర్హుడంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించి దీనిపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రాన్ని ఆదేశించడమే ఇందుకు కారణం. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నివేదికపై చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై స్పష్టత రానుంది. చెన్నమనేని పౌరసత్వం వివాదంపై ఇటు సొంత పార్టీలోనూ చర్చ మొదలైంది. రాష్ట్ర మంతా నయీం హడావుడిలో పడి ఈ విషయానికి మీడియాలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. లేకుంటే ఇదే పతాక శీర్షికన నిలిచేది.
2009లో టీడీపీ నుంచి కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు రమేశ్. కానీ తెలంగాణ ఉద్యమసయయంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ నుంచి గెలిచారు. 2009లో రమేశ్ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. రమేశ్ జర్మనీ పౌరుడు కాబట్టి ఈ ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ మేరకు 2013లో హైకోర్టు రమేశ్ ఎన్నికను కొట్టివేసింది. రమేశ్ దీనిపై సుప్రీంకు వెళ్లగా అక్కడ స్టే లభించింది. 2014లో రమేశ్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆది శ్రీనివాస్ ఈ సారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రమేశ్ పౌరసత్వంపై నివేదికను తెలంగాణ హైకోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ అంశంపై పార్టీలో మాత్రం చర్చ జోరుగానే సాగుతుంది. ఒకవేళ కేంద్రం రమేశ్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే.. అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జర్మనీ పౌరుడైన రమేశ్ తిరిగి భారత సభ్యత్వం పొందాలంటే కనీస 300 రోజులు ఇక్కడ నివాసించాలి. కానీ, ఆయన కేవలం 96 రోజులు మాత్రమే ఇండియాలో ఉన్నారని అందుకే ఆయన భారతీయ పౌరుడు కాదన్నది ఆయన ప్రత్యర్థుల వాదన. ఇందుకు సంబంధించిన కొన్నిఆధారాలను శ్రీనివాస్ సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై స్పందించిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement