రాజమండ్రి వరకు వచ్చారు... అమలాపురం రాలేరా?
ఆవును చంపారన్న ఆపోహతో ఇటీవల అమలాపురంలో దళితులపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరామర్శించారు. అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న విషయాలు వింటుంటే గుండె బరువెక్కుతోందని జగన్ అన్నారు. ఇంతటి దారుణం జరిగినా ప్రశ్నించకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అసలు మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా అని ప్రశ్నించారు. అరవింద్ అనే వ్యక్తి తన […]
ఆవును చంపారన్న ఆపోహతో ఇటీవల అమలాపురంలో దళితులపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరామర్శించారు. అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న విషయాలు వింటుంటే గుండె బరువెక్కుతోందని జగన్ అన్నారు. ఇంతటి దారుణం జరిగినా ప్రశ్నించకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అసలు మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా అని ప్రశ్నించారు. అరవింద్ అనే వ్యక్తి తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఏలిషా, వెంకటేశ్వరరావును కోరాడని జగన్ చెప్పారు. అరవింద్ ఫోన్ చేసిన తర్వాతే ఎలిషా, వెంకటేశ్వరరావు ఆ ఆవును వ్యాన్‌లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది – పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం, చెప్పులు తీసుకుని కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు జగన్.
వాళ్లు నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టాలే గానీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయం కాదన్నారు. పోలీసుల సమక్షంలోనే బాధితులను ఇంకా ఎక్కువగా కొట్టారన్నారు. మర్నాడు అరవింద్ తో మాట్లాడాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో పోలీసులు విచారణ చేశారని జగన్ విమర్శించారు. బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేదన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
Click on Image to Read: