నయీం పద్దతిలోనే నయీంను మట్టుబెట్టారు!
ప్రత్యర్థులను డీల్ కోసం పిలిపించి మట్టుబెట్టడంలో ఆరితేరిన నయీం.. చివరికి అదే ఎత్తుకు బలైపోయాడు. ఆపరేషన్ నయీంను ప్రారంభించిన తరువాత పలువురు పోలీసులు నయీంకు ఈ విషయాన్ని ఉప్పందించారు. దీంతో నయీం ఎప్పటికప్పుడు తన స్థావరాలను మారుస్తూ వస్తున్నాడు. కానీ, తన గురించి పోలీసులు వెదుకుతున్నారని తెలిసినా.. నయీం షాద్ నగర్ ఎందుకు వచ్చాడో తెలిసిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులే నయీంను షాద్ నగర్‌కు రప్పించారు. ఇక్కడ ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్నిఅనుసరించారు పోలీసులు. నయీంకు […]
Advertisement
ప్రత్యర్థులను డీల్ కోసం పిలిపించి మట్టుబెట్టడంలో ఆరితేరిన నయీం.. చివరికి అదే ఎత్తుకు బలైపోయాడు. ఆపరేషన్ నయీంను ప్రారంభించిన తరువాత పలువురు పోలీసులు నయీంకు ఈ విషయాన్ని ఉప్పందించారు. దీంతో నయీం ఎప్పటికప్పుడు తన స్థావరాలను మారుస్తూ వస్తున్నాడు. కానీ, తన గురించి పోలీసులు వెదుకుతున్నారని తెలిసినా.. నయీం షాద్ నగర్ ఎందుకు వచ్చాడో తెలిసిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులే నయీంను షాద్ నగర్‌కు రప్పించారు. ఇక్కడ ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్నిఅనుసరించారు పోలీసులు. నయీంకు పరిచయం ఉన్న ఓ డీఎస్పీతో డీల్ చేద్దాం అని కబురు పెట్టించారు. ఆ సమయంలో నయీం నగరంలోగానీ, షాద్ నగర్‌లోనూ లేడు. వేరే ప్రాంతంలో ఉన్నాడు.
సదరు డీఎస్పీతో గతంలో ఉన్న చనువు, కోట్ల రూపాయల డీల్ కావడంతో నయీం అతన్ని నమ్మి షాద్ నగర్ కి వచ్చాడు. సోమవారం సెటిల్‌మెంట్ ఉందని డీఎస్పీ చెప్పడంతో శనివారం రాత్రి షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు నయీం. అనుచరులతో కలిసి నయీం టౌన్‌షిప్ చేరుకున్నాడని సదరు డీఎస్పీనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మఫ్టీలో ఉన్న పోలీసులు నయీం రాకను ధ్రువీకరించారు. అదే రోజు రాత్రి నయీం ను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కానీ తెల్లవారితే ప్రధాని సభ ఉండటంతో ఆపరేషన్‌ను ఒకరోజు వాయిదా వేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కాపుగాసిన పోలీసులు తెల్లవారుజామున నయీం ఉంటున్న ఇంటిని చుట్టుముట్టారు. వీరి రాకను పసిగట్టిన నయీం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో నయీం గన్‌మెన్ కాల్పులు ప్రారంభించాడు. అప్పటికే నలుదిక్కులా చుట్టుముట్టిన పోలీసులు ప్రతికాల్పులు ప్రారంభించడంతో నయీం హతమయ్యాడు.
Advertisement