జైలుకెళ్లేందుకు సిద్ధం, ఒక వర్గంపై కుట్ర, ఎమ్మెల్యేను చంపాల్సిన అవసరం లేదు...

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఈ స్థాయికి ఎదగడం వెనుక మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి హస్తముందంటూ ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉమామాధవరెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబాన్నిటార్గెట్ చేస్తోందని ఆరోపించారు. మాధవరెడ్డి పేరును చెడగొట్టేందుకు, ఒక సామాజికవర్గానికి దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే తానే నేరుగా జైలుకు వెళ్లేందుకు సిద్దమన్నారామె. నయీం కేసులో నిజానిజాలు తేల్చాలంటే సిట్‌తో […]

Advertisement
Update:2016-08-11 07:55 IST

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఈ స్థాయికి ఎదగడం వెనుక మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి హస్తముందంటూ ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉమామాధవరెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబాన్నిటార్గెట్ చేస్తోందని ఆరోపించారు. మాధవరెడ్డి పేరును చెడగొట్టేందుకు, ఒక సామాజికవర్గానికి దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే తానే నేరుగా జైలుకు వెళ్లేందుకు సిద్దమన్నారామె. నయీం కేసులో నిజానిజాలు తేల్చాలంటే సిట్‌తో కాకుండా జ్యుడిషీయిరీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా తనపై నిందలు వేయడం దారుణమన్నారు. మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఒకే ఫోన్ నెంబర్ వాడుతున్నానని… నిజంగా తాము నయీంతో మాట్లాడి ఉంటే కాల్‌లిస్ట్‌ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక మీడియాలో నేరుగా తన పేరు కాకపోయినా… జాతీయ మీడియాలో నయీం వెనుక ఉన్న మాజీమంత్రి తానేనంటూ రాశారని ఆమె చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేను చంపించేందుకు కుట్ర చేశానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఎమ్మెల్యేను చంపాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండా మీడియాలో తనపై లీకులు రావన్నారు. దీని వెనుక కేసీఆర్‌ హస్తముందని… కాబట్టి ఆయన సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేతలే నయీంను పెంచి పోషించి ఉంటే ఆ నేతలెవరో పట్టుకోవాలన్నారు. అంతేకానీ తనకు ఎందుకు అంటగడుతారని ఉమా మాధవరెడ్డి ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News